సంక్షేమం కాదు!
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:52 AM
శిథిలావస్థలో భవనం, పెచ్చులూడుతున్న పైకప్పు, పొలాల్లో కాలకృత్యాలు, రాత్రిళ్లు పాములు, తేళ్లు.. ఇవీ ఆదోని ఎస్సీ కళాశాల హాస్టల్ దుస్థితి. విద్యార్థులు నిత్యం భయం భయంతోనే కాలం గడుపుతున్నారు. ప్రమాదం జరగకముందే హాస్టల్‌ను మరో భవనంలోకి మార్చాలని కోరుతున్నారు.
పెచ్చులూడుతున్న పైకప్పు
మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థ
ఆదోని అగ్రికల్చర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోనే టీజీఎల్ కాలనీ వెనుక ఉన్న ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. రెండెకరాలకు పైగా స్థలంలో ఈ భవనాన్ని 196-87లో నిర్మించారు. 6 గదులు ఉండగా, ఈ హాస్టల్లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు 136 మందికి పైగా వసతి పొందుతూ చదువుకుం టున్నారు.
పొలాల్లోకి వెళ్లాల్సిందే
హాస్టల్ మరుగు దొడ్లు లేవు. విద్యార్థులు కాలకృ త్యాలు తీర్చుకోవాలంటే పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. రాత్రిళ్లు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. హాస్టల్ చుట్టూ ముళ్లపొదలు, పొలాలు ఉన్నాయి. పట్టణ మురుగు నీరు అంతా హాస్టల్ పక్కన నుంచే వెళుతుంది. రాత్రిళ్లు పాములు, తేళ్లు వస్తున్నాయి. స్నానపు గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు.
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి కూలేం దుకు సిద్ధంగా ఉండడంపై కొన్నేళ్లుగా విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రజాప్రతిని ధులు గాని పట్టించుకోవడం లేదు. హాస్టల్‌ను మరో భవనంలోకి మార్చాలని సాంఘిక సంక్షేమ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే లు, కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ భవనాన్ని చూసిన విద్యార్థులు ఇందులో ఉండేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఇక్కడ చేరినవారు కూడా మధ్యలో హాస్టల్ నుంచి వెళ్లిపోతున్నారు.
శిథిలావస్థకు చేరిన భవనం
హాస్టల్ భవనం ఏళ్ల నాటిది కావడం, అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. చూసేవారికి ఇదో పాడుబడ్డ భవనంగా కనిపిస్తుంది. పైకప్పులు పెచ్చులూడు తుండటంతో విద్యార్థులు భయం భయంగా కాలం గుడుపుతున్నారు. వర్షం వచ్చిందంటే పైకప్పు నుంచి వర్షపునీరు వస్తోంది. ఏ క్షణం ఏమి జరుగు తుందోనని నిద్రలేని రాత్రులు గలపుడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్టీ హాస్టల్-2లోకి మార్చాలి
హాస్టల్‌ను పట్టణంలో ఖాళీగా ఉన్న ఎస్సీ హాస్టల్ నెంబర్ 2లోకి లేదా అద్దె భవనంలోకి మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అలా మారిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు భవనాన్ని మార్చి, నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన భవనం
హాస్టల్ భవనం ఏళ్ల నాటిది కావడం, అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. చూసేవారికి ఇదో పాడుబడ్డ భవనంగా కనిపిస్తుంది. పైకప్పులు పెచ్చులూడు తుండటంతో విద్యార్థులు భయం భయంగా కాలం గుడుపుతున్నారు. వర్షం వచ్చిందంటే పైకప్పు నుంచి వర్షపునీరు వస్తోంది. ఏ క్షణం ఏమి జరుగు తుందోనని నిద్రలేని రాత్రులు గలపుడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.