జీజీహెచలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల నిరసన
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:45 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులన్నీ ఎంపీహెచఏ (ఎఫ్) జీఎనఎం అర్హతతో భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ కావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు భగ్గుమన్నారు.
కర్నూలు(హాస్పిటల్), సెప్టెంబరు 6: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులన్నీ ఎంపీహెచఏ (ఎఫ్) జీఎనఎం అర్హతతో భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ కావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు భగ్గుమన్నారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ చాంబర్ దగ్గర కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నిరసన తెలిపారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల నిరసనకు ఏపీ గవర్నమెంటు నర్సెస్ అసోసియేషన రాష్ట్ర నాయ కులు డి.మంజులదేవి మద్దతు తెలిపారు. ఏఎనఎం నుంచి జీఎనఎం అర్హత తో వచ్చిన వారితో రెగ్యులర్ స్టాప్ నర్సుల పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. సీనియారిటీ ప్రకారం లిస్టు పెట్టి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వం 2020లో ఏఎనఎం నుంచి జీఎనఎం శిక్షణను స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్కిల్ డెవల ప్మెంట్ మాటను పక్కకు పెట్టి 2122 రెగ్యులర్ పోస్టులను శిక్షణ పొందిన వారితో ఎలా భర్తీ చేస్తారనీ ప్రశ్నించారు.