Share News

‘అమరుల సేవలు చిరస్మరణీయం’

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

అటవీశాఖలో అమరుల సేవలు చిరస్మరణీయమని ఆత్మకూరు అటవీ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా అన్నారు.

‘అమరుల సేవలు చిరస్మరణీయం’
అమరులకు నివాళి అర్పిస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా

ఆత్మకూరు, సెప్టెంబరు 11: అటవీశాఖలో అమరుల సేవలు చిరస్మరణీయమని ఆత్మకూరు అటవీ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా అన్నారు. బుధవారం అటవీశాఖ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డివిజన్‌ కార్యాలయంలో అటవీ అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అడవుల సంరక్షణకు అటవీశాఖ విశేషంగా కృషిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే అటవీరక్షణలో స్మగ్లర్ల చేతిలో పలు సందర్భాల్లో అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రత్యేకించి ఆత్మకూరు అటవీ డివిజన్‌లో రేంజర్‌ రామయ్య మావోయిస్టుల చేతుల్లో మృతిచెందడం బాధాకరమని అన్నారు. ఆత్మకూరు రేంజర్‌ పట్టాభి, యాంటి పోచింగ్‌ రేంజర్‌ సుభాష్‌ సిబ్బంది ఉన్నారు. బైర్లూటి రేంజ్‌లోని దివంగత అటవీ రేంజ్‌ అధికారి రామయ్య స్థూపం వద్ద నాగలూటి రేంజర్‌ దొరస్వామి పుష్పాంజలి ఘటించారు. ఏపీ డిప్యూటీ రేంజర్స్‌ అండ్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణగౌడ్‌ ఆధ్వర్యంలో కరివేన సమీపంలోని మానవతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM