Share News

దారి దోపిడీ దొంగలకు రెండేళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:52 PM

పాణ్యం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్‌నగ ర్‌కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

దారి దోపిడీ దొంగలకు రెండేళ్ల జైలు శిక్ష

నంద్యాల క్రైం/పాణ్యం, జూలై 26: పాణ్యం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్‌నగ ర్‌కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్‌నగ ర్‌కు వెళ్లేదారిలో నిర్మానుష్య ప్రదేశమైన గొటికమాను బీడులో కొందరు వ్యక్తులు గుంపులుగా దారిదోపిడీకి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు అప్పటి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌ గంగనాథ్‌బాబు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లగా వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని తనిఖీ చేసి వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాణ్యం గ్రామానికి చెందిన చెంచు దాసరి వీరయ్య, చిగుర్ల మంథనాలు అలియాస్‌ మంతిగాడు, చిగుర్ల గొలుసన్న అలియాస్‌ గొలుసుగాడు, గోరుకల్లు గ్రామానికి చెందిన తోటనాగన్న అలియాస్‌ చిన్న, తోట చిన్న ఈరన్న అలియాస్‌ చిన్న ఈరిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా సీనియర్‌ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీనారాయణ కోర్టులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించినందున నంద్యాల ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్‌ జడ్జి విచారణ జరిపి నేరం రుజువైనందున సదరు ముద్దాయిలకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.7వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:52 PM