YSRCP: ఉండవల్లిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
ABN , Publish Date - Jun 22 , 2024 | 07:31 AM
ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ జల్సా మహల్ నిర్మించుకున్నారు. ఇక్కడ విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం జరిగింది. జగన్ పాలనలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు నామ మాత్రపు లీజుతో కొట్టిసిన వైనం.
అమరావతి: ఉండవల్లిలోని బోటు యార్డ్ స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని నిర్ధారణ కావడంతో నేటి (శనివారం) తెల్లవారుజాము నుంచి కూల్చివేస్తున్నారు. జగన్ పాలనలో అక్రమ నిర్మాణాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. రుషికొండపై జనం సొమ్ముతో జగన్ జల్సా మహల్ నిర్మించుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం జరిగింది. జగన్ పాలనలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు నామ మాత్రపు లీజుతో కొట్టేశారు. ఉండవల్లిలోని బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం లీజుకి జగన్ సర్కార్ కట్టబెట్టింది. అప్పట్లో ఈ అంశాన్ని ప్రశ్నించిన టీడీపీ, జనసేనలు ప్రస్తావించాయి. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రసారం చేసింది.
ఇప్పుడు బోట్ యార్డ్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను ప్రభుత్వ యంత్రాంగం తొలగిస్తోంది. బ్రిటిష్ హయాంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో బోటు యార్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోట్ యార్డ్ వద్దే పడవలకు మరమ్మతులు చేసి జల రవాణా చేస్తోంది. ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీళ్లు కల్పించేందుకు ప్లాంట్ పెడతానని ప్రభుత్వానికి అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. అక్కడ భారీ ఎత్తున స్థలం ఉందని ఈ లేఖతో వెలుగులోకి వచ్చింది. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో వైసీపీ పెద్దలు కన్నేశారు. సుమారు రెండు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం నామమాత్రపు రేటుకు అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మారడంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. బోట్ యార్డును వైసీపీ కబ్జా నుంచి ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుతోంది.