Share News

AP News: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:51 PM

అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని అన్నదానం హాలు సీలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. నాణ్యత ప్రమాణాల లోపం కారణంగానే సీలింగ్ కూలిందని భక్తులు, స్థానికులు అంటున్నారు. నాలుగు నెలల క్రితమే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అట్టహాసంగా అన్నదానం హాలుని ప్రారంభించారు.

AP News: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

విజయవాడ: అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని అన్నదానం హాలు సీలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. నాణ్యత ప్రమాణాల లోపం కారణంగానే సీలింగ్ కూలిందని భక్తులు, స్థానికులు అంటున్నారు. నాలుగు నెలల క్రితమే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అట్టహాసంగా అన్నదానం హాలుని ప్రారంభించారు. నిజానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో భక్తులెవరూ హాలులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!


లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టే పనులలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటం, కాంట్రాక్టర్ల నాణ్యత ప్రమాణం లోపించడంతోనే కూలిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ డిసెంబరులోనే దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నదానం హాలును ప్రారంభించారు. నాలుగు నెలల వ్యవధిలోనే సీలింగ్ విరిగిపడటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో.. వేలాదిగా భక్తులు ఉండే అన్నదానం హాలులో సీలింగ్ విరిగిపడి పెను ప్రమాదం తప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా అధికారులు శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 12:51 PM