Share News

Lok Sabha Updates: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ శబరి ఆగ్రహం..

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:27 PM

ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్‌సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.

Lok Sabha Updates: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ శబరి ఆగ్రహం..

Loksabha: ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్‌సభ(Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు. ఈడీ, సీబీఐ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని, ఆ రెండు సంస్థలతో కేంద్రప్రభుత్వం చంద్రబాబును బెదిరించిందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అవి పూర్తిగా అవాస్తవమని.. టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.


రాష్ట్రప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై సీఐడీతో అక్రమ కేసులు పెట్టించిందని, తన సొంత నియోజకవర్గం నంద్యాలలోనే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 164 చోట్ల గెలిచిందన్నారు. 25 లోక్‌సభ సీట్లలో 21 సీట్లను గెలుచుకుందని తెలిపారు. అవగాహన రాహిత్యంతో కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం క్లచ్ టీడీపీ, జేడీయూ చేతిలో ఉందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారని.. కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమన్వయంతో కేంద్రప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మరోవైపు వైసీపీ గత ఐదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసిందన్నారు.


వైసీపీ అంటే..

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిందని.. వైసీపీ పాలనలో యువత బెగ్గింగ్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని, శ్రామికులు ఆకలి చావులు చస్తున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థతి ఏర్పడిందన్నారు ఎంపీ శబరి. ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 05:36 PM