Share News

Nara Lokesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మార్చిలో

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:07 AM

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

Nara Lokesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మార్చిలో

1 నుంచి 20 వరకూ ఇంటర్‌ ఎగ్జామ్స్‌

విద్యార్థులకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌

17 నుంచి 31 వరకూ టెన్త్‌ పరీక్షలు

షెడ్యూలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. మార్చి 1 నుంచి 20 వరకూ ఇంటర్‌ పరీక్షలు, మార్చి 17 నుంచి 31 వరకూ పదో తరగత పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఈ పరీక్షల మంత్రి లోకేశ్‌ షెడ్యూల్‌ను బుధవారం వేర్వేరుగా విడుదల చేశారు. టెన్త్‌ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఈసారి రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూలు రూపొందించారు. విద్యార్థులకు చదువుకునేందుకు సమయం లభించేలా కనీసం ఒకరోజు ఖాళీ వచ్చేలా తేదీలు ఖరారు చేశారు. తెలుగులో పరీక్షలు రాసేందుకు మొత్తం 49వేల మంది విద్యార్థులు మీడియం ఎంపిక చేసుకున్నారు. కాగా, ఇంటర్‌ విద్యార్థులకు ఎథిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష ఫిబ్రవరి 1న, పర్యావరణ విద్య పరీక్ష ఫిబ్రవరి 3 జరుగుతాయి. జనరల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు, ఒకేషనల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

ఇంటర్‌ పరీక్షల టైమ్‌ టేబుల్‌

fgh.jpg

Updated Date - Dec 12 , 2024 | 04:08 AM