Share News

Somireddy: గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకొస్తున్నాయి..

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:49 PM

అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Somireddy: గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకొస్తున్నాయి..

అమరావతి: జగన్ ప్రభుత్వ (Jagan Govt.,) హయాంలోని మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs) చేసిన భూ దందాలు (Land Grabs) ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లి (Madanapalli)లో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా(Revenue Special Chief Secretary Sisodia) బాధితుల (Victims) ఫిర్యాదులను (complaints) స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే (TDP MLA) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అమరావతి, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అక్రమాలు బయటపడతాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారని విమర్శించారు. ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని.. పెద్దిరెడ్డి ముఠా పేదల భూములు కొట్టేసిందని, సిగ్గులేకుండా జగన్ ఢీల్లీలో ధర్నా చేశారని సోమిరెడ్డి దుయ్యబట్టారు.


జగన్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని, నెల్లూరు కోర్టులో ఓ మంత్రి ఫైల్స్ దొంగతనాలు చేశారని... ఇంకో మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టారని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ రెడ్డి తమకు సంబంధం లేదని అంటున్నారని, మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా వాళ్లే కదా అధికారంలో ఉందని.. బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారని.. అది కాస్త బెడిసికొట్టిందన్నారు.


అధికారం కోసం... తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని, ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు. శ్వేత పత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. వైసీపీకి11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమైంది... నిజాయితీగా మాట్లాడడానికి ఒక్కరు చాలరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.


కాగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్దమైన నేపథ్యంలో భూ బాధితులు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను కలిసి ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాధితుల నుంచి సిసోడియా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసి భూ కబ్జా చేయడం జరిగిందని, తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో వచ్చామని బాధితులు ఏబీఎన్‌కు తెలిపారు. తమ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని ఓ బాధితుడు తెలిపారు. ఇలా చాలా మంది బాధితులు తమ సమస్యలను ఏబీఎన్‌కు తెలిపారు. ఇకనైనా తమ భూములు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో కలెక్టర్, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో జగన్ చేసింది ధర్నా కాదు.. డ్రామా..

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. (ఫోటో గ్యాలరీ)

పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యుల ఆగ్రహం

పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్‌

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 26 , 2024 | 01:50 PM