Share News

AP News: విశాఖలో ఎన్నికలకు నో బ్రేక్.. ఈసీ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Aug 08 , 2024 | 09:46 AM

నేడు జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున విద్యాశాఖ వాయిదా వేసిందని ప్రచారం జరిగింది.

AP News: విశాఖలో ఎన్నికలకు నో బ్రేక్.. ఈసీ గ్రీన్ సిగ్నల్

విశాఖ: నేడు జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున విద్యాశాఖ వాయిదా వేసిందని ప్రచారం జరిగింది. విశాఖలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి. స్కూల్ కమిటీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో 596 ప్రభుత్వ పాఠశాలలు.. మొత్తం 77 వేల మంది విద్యార్థులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందున ఈసీకి లేఖ రాసిన జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో 596 పాఠశాలలో ఎన్నికలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.


విశాఖ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని డీఈవో చంద్రకళ తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో ఈ రోజు (గురువారం) ఉదయం 10:00 నుంచి 1:00 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికలకు బ్రేక్ అని వచ్చిన వార్తలు కరెక్ట్ కాదని ఆమె వెల్లడించారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తేదీ.08-08-2024 అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు యథావిధిగా పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చంద్రకళ స్పష్టం చేశారు.


ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 2,449 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఎంఈవోలు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకం చేశారు. ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతీ తరగతి నుంచి ముగ్గురేసి సభ్యులను ముందుగా ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. మధ్యాహ్నం 1.30 గంటలు నుంచి కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతీ తరగతి నుంచి ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాలెట్‌ ద్వారా కూడా ఎన్నికల నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 3 నుంచి 3.30 గంటల మఽద్య మొదటి కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. ఈ పక్రియ అంతా విద్యాశాఖ జారీ చేసిన పత్రాలను పూర్తి చేసి ఎంఈవోలకు అందజేయాలి.

Updated Date - Aug 08 , 2024 | 09:46 AM