Chiranjeevi: పవన్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Sep 02 , 2024 | 09:10 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈసారి జరుపుకుంటున్న జన్మదిన వేడుక పవన్‌కు ఎంత ప్రత్యేకమైనది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌కి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. పవన్‌లాంటి(Pawan Kalyan) నాయకుడు ఏపీ ప్రజలకు కావాలని చిరు(Chiranjeevi) పేర్కొన్నారు.
రాజకీయాల్లో రాణిస్తూ.. అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. చిరు తన ఎక్స్ పోస్ట్‌లో "కళ్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అని పోస్ట్ చేశారు. పవన్, చిరు కలిసి ఉన్న పాత ఫొటోను ఆయన తన పోస్ట్‌కి జత చేశారు
జీవిత విశేషాలివే..
కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న పవన్ మూడో సంతానంగా జన్మించారు . వెంకట్రావు కానిస్టేబుల్ కావడంతో వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో పవన్ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి యాస, మాండలీకాలు, సంస్కృతులు గమనించేవారు. తండ్రి చాలీచాలని జీతం, పేదరికం కారణంగా ఎన్నో కష్టాలనుభవించారు. చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడ్డారు. ఈ సమస్యతో తరచూ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యేవారు.
చదువులో రాణించకలేకపోవడంతో ఒత్తిడికిలోనై ఆయన ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. చివరికి అన్నయ్య చిరంజీవి సాయంతో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్, ఎంతో కష్టపడి సినిమా రంగంలో, అటు రాజకీయంగానూ ఉన్నత స్థానానికి వెళ్లారు.
For Latest News click here