Home » Deputy CM Pawan Kalyan
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గురువారం శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు?
మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు.
మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.
ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్ ఎదురుగా ఉన్న ఓ కార్ వాష్ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటనటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.