Pawan Kalyan: మహిళలు, యువతుల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్..
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:18 PM
మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. వారి అదృశ్యంపై ఒక్క ప్రకటనా జగన్ సర్కార్ చేయలేదని ఆయన మండిపడ్డారు. కానీ ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మెుదలైందని ఆయన చెప్పుకొచ్చారు.
HYDRA: అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక
ఈ సందర్భంగా 18 మంది మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేసులు ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు, హోంమంత్రిత్వ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. ఏపీ పోలీసులను చూసి తాను గర్వపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అన్నారు.
AP News: డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులు.. టీడీపీ నేత ఏం చేశాడంటే
మహిళల భద్రత, వారి హక్కులు పరిరక్షించేందుకు ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖకు పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరులు సైతం చురుకుగా, అప్రమత్తంగా ఉంటూ మన గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా మార్చుకోవాలని, వాటిని మరింత భద్రంగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు పైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
Real Latest AP News And Telugu News