Share News

Chandrababu: అరకు కాఫీ గురించి ప్రపంచవ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడాయి

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:48 PM

ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని.. మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు.

Chandrababu: అరకు కాఫీ గురించి ప్రపంచవ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడాయి

అమరావతి: ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని.. మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు. దాదాపు 5% ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారన్నారు. గురువు లేకుండా విద్య మీద ఫోకస్ పెట్టి విల్లు విద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలవ్యుడు అని.. ఆయన గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు. గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీ గురించి ప్రపంచ వ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడాయన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారన్నారు.


గిరిజన అభివృద్ధి కోసం 19 పథకాలు..

స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో అందరూ అభివృద్ధి వైపు వెళ్తుంటే గిరిజనులు మాత్రం ఆదివాసులు, షెడ్యూల్ కులాలు, బీసీలు వెనకబడ్డారన్నారు. మన పిల్లలే మనకు ఆస్తి అని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అని.. తెలంగాణలో రూ. 3లక్షల 20 వేలు అని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో ఉండే ఆదివాసుల తలసరి ఆదాయం కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమేనన్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చూసుకోవాలని చంద్రబాబు అన్నారు. 2014 నుంచి 19 వరకూ గిరిజన అభివృద్ధి కోసం 19 పథకాలు తీసుకొచ్చానన్నారు. ఆదివాసులు చదువుకోవాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ గురుకుల పాఠశాలను గ్రామ గ్రామాన స్థాపించారని చంద్రబాబు తెలిపారు. గిరిజన ప్రాంత మహిళలు అటవీ ప్రాంతానికి పరిమితం కాకూడదని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువుల అభ్యసించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఆదివాసీలు రావాల్సిన అవసరం ఉందన్నారు.


టెక్నాలజీతో పేదరిక నిర్మూలన..

ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నా కూడా... గిరిజనులు మాత్రం ఇంకా డోలీలో వస్తున్నారంటే మనం సిగ్గుపడాలని చంద్రబాబు పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్నవారు సైతం తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు. బాక్సైడ్ తవ్వకాలు నిలిపివేస్తే లెటర్ రైడ్ పేరుతో మళ్లీ తీసుకొచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో నిర్దిష్టమైన విధానాలతో గణనీయంగా ఆదివాసులలో ఎన్డీఏ ప్రభుత్వం మార్పు తీసుకొస్తుందన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో తాగునీరు రాని గ్రామాలు ఉన్నాయన్నారు. గిరిజన పిల్లల కోసం మెగా డీఎస్సీని అనౌన్స్ చేశామని చంద్రబాబు తెలిపారు. విశాఖ , విజయవాడలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గిరిజన ప్రాంతంలో తయారు చేసే వస్తువుల్ని ఓఎన్‌డీసీ ప్లాట్ ఫారం ద్వారా అమ్మకాలు చేస్తామన్నారు.


పాడేరులో మెడికల్ కాలేజ్..

20191 ఎస్టీ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు త్వరలో రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. 2373 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క గిరిజన ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో పసుపును వాణిజ్య పంటగా తీసుకొస్తామన్నారు. పాడేరులో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని పూర్తిగా చేస్తామన్నారు. పేదవారికి పెన్షన్లు పెంచుతానని మాట ఇచ్చానని.. అది ఆచరణ చేసి చూపించానన్నారు. వలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమని ఎన్నికలప్పుడు వైసీపీ నాయకులు చెప్పారన్నారు. ఒక రోజులో 99 శాతం పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. తాను ఎక్కడా రాజకీయ వివక్షత చూపించలేదని.. రాజకీయ కక్ష చూపించానని ఈ రోజు నుంచి చైతన్యం 2.0 ప్రారంభమైందని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Aug 09 , 2024 | 01:48 PM