Share News

Pawan Kalyan: బెంగుళూరుకి పవన్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఫోకస్..

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:11 AM

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బెంగుళూరుకి బయలుదేరారు. ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరి కట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

Pawan Kalyan: బెంగుళూరుకి పవన్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఫోకస్..

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బెంగుళూరుకి బయలుదేరారు. ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరి కట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అక్కడ ప్రభుత్వ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగనుంది. ఏపీలో‌ చెక్ పోస్ట్‌లను దాటుకుని వెళ్లిన లారీలను పక్క రాష్ట్రాల్లో పట్టుకున్న అంశాలను ఇటీవల పవన్ ప్రస్తావించారు. ఈ నెల 13న శ్రీహరి కోటకు ఆయన వెళ్లనున్నారు.


కుంకి ఏనుగుల మనుగడ, జీవన విధానంలో మార్పుపై పవన్ చర్చించనున్నారు. వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మనుగడ పైనా ఆ రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడనున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. ఈ కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను ఇవాళ పవన్ కోరనున్నారు. ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకడమే కాకుండా.. పార్టీ నేతలకు సైతం అదే బాటలో నడిచేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలే అజెండాగా పని చేస్తున్నారు. కష్టంలోఉన్నానంటే చాలు.. వారి కష్టాన్ని తీర్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రజలతో మాట్లాడే సమయంలోనూ ఒక సామాన్యుడిలా మాట్లాడటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.


ఇక ప్రస్తుతం పవన్ ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ఫోకస్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ స్మగ్లింగ్‌పై దృష్టి సారించారు. గత నెలలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధింత అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళిక బద్దంగా తనిఖీలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వైస్సాఆర్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్, కేసు వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కు అధికారులు అందించారు. దీంతో స్మగ్లర్లు శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలని ఆదేశించారు. ఇక ఇప్పుడు మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వపన్ ఫోకస్ పెట్టారు. అలాగే కుంకి ఏనుగుల గురించి సైతం పవన్ తెలుసుకోనున్నారు.

Updated Date - Aug 08 , 2024 | 11:13 AM