Share News

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి

ABN , Publish Date - May 09 , 2024 | 12:55 AM

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని ఎన్‌డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి అన్నారు.

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి

మార్కాపురం, మే 8: టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని ఎన్‌డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి అన్నారు. స్థానిక సౌజన్య ఫంక్షన్‌ హాలులో బుధవారం నియోజకవర్గస్థాయి తెలుగు మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన రాఘవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారం లోకి వస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 బ్యాంకు అకౌంట్‌లలో జమచేస్తామ న్నా రు. తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు న్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మాట్లా డుతూ డ్వాక్రా సంఘాలను స్థాపించింది చంద్రబాబు నాయుడే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి తెలుగు మహిళ తెగువచూపి అఖండ మెజార్జీతో టీడీపీని గెలించాలని కోరారు. కార్యక్రమంలో నారామణరెడ్డి భార్య వసంతలక్ష్మి, రాఘవరెడ్డి భార్య చందన, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, మద్దెల లక్ష్మి, టీడీపీ నాయకులు తడికమళ్ల బాలసుబ్బారావు, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మర్రి ఝాన్సీరాణి, నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగు మహిళలు పాల్గొన్నారు.

మార్కాపురం : పేదల కష్టాలు తీరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి అన్నారు. ఇంటింటికి మన కందుల కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక 24, 25 వార్డుల్లో టీడీపీ మహిళా విభాగం కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్‌లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ వక్కలగడ్డ రాధిక, 24వ వార్డు కౌన్సిలర్‌ రమ్యస్వాతి, టీడీపీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మర్రి ఝాన్సీరాణి, మహిళలు పాల్గొన్నారు.

50 కుటుంబాలు టీడీపీలో చేరిక

మార్కాపురం : నియోజకవర్గంలోని పట్టణం, పలు మండలాలకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీ అఽభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పట్టణంలోని తూర్పువీధికి చెందిన బత్తుల వెంకట్‌ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, తర్లుపాడు మండలంలోని జంగంరెడ్డిపల్లికి చెందిన 20 కుటుంబాలు, పొదిలి మండలంలోని మూగచింతలకు చెందిన వైసీపీ కీలక నాయకులు బండారు వెంకటరామయ్య, బోయపాటి రమణయ్యల ఆధ్వర్యలో 10 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం

మార్కాపురం రూరల్‌ : పశ్చిమ ప్రాంత ప్రజలకు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బొందలపాడు, భూపతిపల్లి పంచాయతీలలో బుధవారం రాత్రి నాయకుల తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా కందుల మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రైతులను నట్టేట ముంచారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే మార్కాపురం ప్రత్యేక జిల్లా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. తన జీవిత ఆశయమని అన్నారు. వచ్చే ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం మండల నాయకులు, ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:55 AM