Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - May 09 , 2024 | 01:50 AM

జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి ఉరు ములు, మెరుపులతో కురిసిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

గాలివాన బీభత్సం

పశ్చిమప్రాంతం అతలాకుతలం

కొన్నిచోట్ల పిడుగులు

మాల్యవంతునిపాడులో 35 గొర్రెలు మృతి

మార్కాపురం వైద్యశాలలో కూలిన నిర్మాణాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గుండ్లకమ్మలోకి స్వల్పంగా నీటి ప్రవాహం

ఒంగోలు, మే 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి ఉరు ములు, మెరుపులతో కురిసిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. పశ్చిమప్రాంతంలో తీవ్రత అధికంగా ఉంది. పెనుగాలులు, వర్షానికి మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిర్మాణాలు కూలిపోయాయి. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పడిపోయాయి. పలుచోట్ల కరెం టు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో గంటలకొద్దీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

33.20 మి.మీ వర్షపాతం

జిల్లాలో పక్షం రోజులుగా ఎండలు మండిపోతు న్నాయి. అత్యధిక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42నుంచి 45 డిగ్రీలు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం కొన్నిచోట్ల జల్లులు పడ్డాయి. తిరిగి మంగళ వారం సాయంత్రం వాతావరణం మారింది. రాత్రికి పలు ప్రాంతాల్లో వాన మొదలైంది. అర్ధరాత్రి సమ యంలో చాలా చోట్ల పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో ఈనెల సాధారణ వర్షపాతం 52.0మి.మీ కాగా మంగళవారం రాత్రి సుమారు 33.20 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మద్దిపాడు మండలంలో 130.6 మి.మీ కురిసింది. మార్కాపురం మండలంలో 98.4, ఎన్‌జీ పాడులో 88.0, పుల్లలచెరువులో 65.2, తర్లుబాడు 59.4, మర్రిపూడిలో 58.4, పొదిలిలో 52.4, హను మంతునిపాడులో 52.0, పెద్దారవీడులో 48.6, త్రిపురాంతకంలో 42.6, కొనకనమిట్లలో 40.6 మి.మీ వర్షపాతం నమోదైంది. దోర్నాల మండలంలో 38.6 మి.మీ, కనిగిరిలో 37.0, సంతనూ తలపాడులో 35.8. ముండ్లమూరులో 35.6, ఇతర మరో 15 మండలాల్లో 10నుంచి 35 మి.మీ వర్షపాతం నమోదైంది. మండుతున్న ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజానీకానికి ఉపశమనం లభించింది.

కొన్నిచోట్ల నష్టం

పెద్దఎత్తున వీచిన గాలులు, ఉరుములు, మెరు పులు, పిడుగులతో కొన్నిచోట్ల నష్టం వాటిల్లింది. మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ కోసం ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనంపై తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. అవి నాసిరకంగా చేసినట్లు తెలుస్తుండగా కొద్దిపాటి వర్షాలకే గోడకూలింది. సీలింగ్‌ మొత్తం పోయి బెడ్లు దెబ్బతిన్నాయి. ఆ పట్టణంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ గాలుల తీవ్రతకు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు నేలవాలాయి. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడులో పిడుగుపడి 8మంది రైతులకు చెందిన 35 గొర్రెలు మృతి చెంది దాదాపు రూ.5 లక్షల మేర నష్టపోయారు. తర్లుపాడులో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. గాలుల తీవ్రతకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగిపోవడంతో పలు పట్టణాలతోపాటు అనేక గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా వర్షానికి పశ్చిమ ప్రాంతంలో గుండ్లకమ్మలోకి కాస్తంత ప్రవాహం రావడంతోపాటు కొన్ని చోట్ల చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.

Updated Date - May 09 , 2024 | 01:50 AM