Share News

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 12:35 AM

ల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికా రైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

 ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి దినేష్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 8: జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికా రైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. అందుకోసం సమగ్ర పర్యవేక్షణ ఎంతో కీలకమన్నారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి బుధవారం నియోజకవర్గాల రిటర్నింగ్‌ ఆఫీసర్లు, ఏఆర్వోలు, ఏపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్ల రాకపోకలను క్ర మబద్ధీకరించేలా బారికేడ్లు, లైటింగ్‌, మైక్‌సిస్టమ్‌, ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉంటే ఓటర్లకు సహాయపడేలా హెల్ప్‌ డెస్క్‌, తాగునీరు, వాహనాలకు పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాలని చె ప్పారు. పోలింగ్‌ రోజున అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉంటున్నం దున ముందు రోజే సిబ్బంది చేరుకుంటారని, అక్కడ వారికి వసతి, ఆహార సదుపాయం కల్పించేందుకు దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉన్నామనే భరోసాను స్థానిక బీఎల్‌వో లు కల్పించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఇటుకలు, కర్ర లు, భవన నిర్మాణాలకు వినియోగించే ఎలాంటి సామగ్రి లేకుండా చూసుకోవాలన్నారు. ఈనెల 10,11 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాలను శుభ్రం చేసేందుకు స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బీఎల్‌వోలు ఎప్పటికప్పుడు పైస్థాయి అఽధికారుల దృష్టికి తీసుకురావాలని, పోలింగ్‌ కేంద్రం, పరిసర ప్రాంతాలు కవర్‌ అయ్యేలా సీసీకెమెరాలు పని చేసేలా చూడాలని వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:35 AM