Share News

డిగ్రీ కళాశాలలో వసతులు కరువు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:49 AM

ప్రభుత్వం ఆర్భాటంగా మంజూరు చేసిన డిగ్రీ కళాశాల వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో విద్యార్థుల విద్య కుంటుపడు తోంది.

డిగ్రీ కళాశాలలో వసతులు కరువు

పెద్ద దోర్నాల, జులై 26: ప్రభుత్వం ఆర్భాటంగా మంజూరు చేసిన డిగ్రీ కళాశాల వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో విద్యార్థుల విద్య కుంటుపడు తోంది. గత ప్రభుత్వం 2022 నవంబరులో డిగ్రీ కళా శాలను మంజూరు చేసింది. కానీ వసతులు కల్పించడం విస్మరించింది. తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తరగతి గదుల్లో డిగ్రీ విద్యార్ధులు అభ్యసి స్తున్నారు. దీంతో ఇంటర్మిడియట్‌ విద్యార్థులకు డిగ్రీ విద్యార్ధులకు విడతల వారీగా బోధించాల్సి వస్తోంది. ఉదయం గం.8ల నుండి మధ్యాహ్నం గం.12 ల వరకు ఇంటర్మిడియట్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం గం.12-30ల నుండి సాయంత్రం గం.5ల వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. అది కూడా 12 తరగతి గదులు అవసరం కాగా ఏడు తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌ సావిత్రి తెలిపారు. కొన్నిసార్లు ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు సాయం త్రం 4గంటల వరకు కూడా తరగతులు నిర్వహించే అవసరం వస్తోంది. ఆ సమయంలో మరింత ఇబ్బందికరంగా ఉంటోందని ఆమె చెప్పారు. అధ్యాకులు పూర్తిస్థాయిలో ఉన్నా విద్యార్థులకు విద్యనందించలేక పోతున్నామని అధ్యాపకులు చెబుతు న్నారు. కళాశాల కార్యాలయ పనులు నిర్వహణ, అధ్యాపక సిబ్బంది కొద్దిసేపు సేదతీరే గదులు కూడా లేక ఇబ్బందు లు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు పాలకులు స్పందించాలని కోరుతున్నారు.

కళాశాల నిర్మాణానికి స్థలసేకరణ ముఖ్యం

గత ప్రభుత్వం హడావుడిగా కళాశాలను మంజూరు చేసింది. కానీ అందుకు తగిన స్థలం, నిధుల కేటాయింపు పట్ల నిర్లక్ష్యం వహించడంతో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక ఇంటర్మిడియట్‌తోనే ఇంటికి పరిమితమవుతున్నారు. ప్రధానంగా బాలికలు. గిరిజన నిరుపేదలు అధికంగా ఉండే జిల్లా శివారు ప్రాంతం కావడంతో డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో సంతోషించారు. అయితే కళాశాలకు అవసరమయ్యే స్థలం సేకరణ చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ భూమి అందుబాటు లో ఉంటే వెంటనే నిధులు మంజూరు అయ్యే అవకాశం కూడా ఉందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. స్థానికంగా నిరుపయోగంగా వ్యవసాయ మార్కెట్టు యార్డు 13 ఎకరాలు ఉండగా 2 ఎకరాలు మండల కార్యాలయాలకు ప్రభుత్వం కేటాయించింది. ఇంకా 11 ఎకరాలు అందుబాటులో ఉంది. మూడు దశాబ్దాలు దాటినా నేటికీ వ్యవసాయ మార్కెట్‌ యార్డు విని యోగంలోకి రాలేదు. ముళ్లకంపతో అస్తవ్యస్తంగా మారింది. ఆకతాయిలకు అసాంఘిక చర్యలకు ఆవాసంగా మారింది. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో బాలికలకు రక్షణగా కూడా ఉంటుందని పట్టణానికి చెందిన పలువురు పెద్దలు భావిస్తున్నారు. కళాశాలకు ఐదు ఎకరాలు స్థలం అవసర మవుతుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.ప్రభుత్వం స్పందించి కళాశాల నిర్మాణం చేపట్టాలని, పేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:49 AM