Share News

జగన్‌రెడ్డి నాటకాలను ప్రజలు నమ్మరు

ABN , Publish Date - May 08 , 2024 | 11:49 PM

జగన్‌రెడ్డి కపట నాటకాలను ప్రజలు ఇక నమ్మరని, వైసీపీలో అరాచకాలను అందరూ ఈసడించుకుంటున్నారని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. టీడీపీ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి..సంక్షేమం చంద్రబాబకు రెండు కళ్లలాంటివన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటానని కొండయ్య హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి కొండయ్య, తన మేనల్లుడు సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సలగల రాజశేఖరబాబుతో కలసి రోడ్డుషో నిర్వహించారు.

జగన్‌రెడ్డి నాటకాలను ప్రజలు నమ్మరు
రోడ్‌షోలో పాల్గొన్న కొండయ్య, హీరో నిఖిల్‌

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య

చీరాల, మే 8 : జగన్‌రెడ్డి కపట నాటకాలను ప్రజలు ఇక నమ్మరని, వైసీపీలో అరాచకాలను అందరూ ఈసడించుకుంటున్నారని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. టీడీపీ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి..సంక్షేమం చంద్రబాబకు రెండు కళ్లలాంటివన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటానని కొండయ్య హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి కొండయ్య, తన మేనల్లుడు సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సలగల రాజశేఖరబాబుతో కలసి రోడ్డుషో నిర్వహించారు. ముందుగా కారంచేడు గేటు సెంటర్లోని డాక్టర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. కొండయ్య మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. జగన్‌రెడ్డి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో పదింతలు లాక్కున్నారని పలు అంశాలను కొండయ్య ఉదహరించారు. నిత్యావసరాల ధరలతో మూడుపూటలా తినలేని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని సమస్యలకూ ఒక్కటే పరిష్కారం..అంది చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమని అన్నారు. 13వ తేదీ సోమవారం సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను (కొండయ్య), ఎంపీగా కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని కొండయ్య విజ్ఞప్తి చేశారు. సినీ హీరో నిఖిల్‌ మాట్లాడుతూ మామయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంచి, చెడులను ఆలోచించి చైతన్యవంతంగా ముందగుడు వేస్తే భవిష్యత్‌ తరాలకు మంచి నాయకత్వాన్ని అందించినవారవుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పిట్టువారిపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కొండయ్య కుమార్తె శివనారాయణదేవి కూటమి శ్రేణులతో కలసి ఇంటి, ఇంటికి తిరుగుతూ సూపర్‌సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌పై కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి కొండయ్యను, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:49 PM