Share News

వైసీపీ పాలనలో సమస్యలు ఏకరువు

ABN , Publish Date - May 08 , 2024 | 11:56 PM

వైసీపీ పాలనలో సమస్యలు ఏకరువు పెడుతున్నాయని, ప్రజలకు కనీస వసలుతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, పర్చూరులోని నెహ్రుకాలనీ, లక్ష్మీపురం, అద్దంకి మాన్యం నూతలపాడు, చెరుకూరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏలూరి పాల్గొన్నారు. ఆయా గ్రామాలు కాలనీలకు చేరుకున్న ఏలూరికి ప్రజలు హారతులతో ఘనస్వాగంతం పలికారు. ఆప్యాయంగా పలుకురిస్తూ వృద్ధులు, మహిళలు, యువకులు మా మద్దతు మీకే అంటూ భరోసా ఇచ్చారు.

వైసీపీ పాలనలో సమస్యలు ఏకరువు
పర్చూరు నెహ్రుకాలనీలో ప్రజలకు విక్టర్‌ గుర్తుతో అభివాదం చేస్తున్న ఏలూరి

కాలనీల్లో వసతులు లేవు

సంక్షేమ పథకాల పేరుతో మమ

అన్నివర్గాలను దోచుకున్న జగన్‌రెడ్డి

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, మే 8 : వైసీపీ పాలనలో సమస్యలు ఏకరువు పెడుతున్నాయని, ప్రజలకు కనీస వసలుతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, పర్చూరులోని నెహ్రుకాలనీ, లక్ష్మీపురం, అద్దంకి మాన్యం నూతలపాడు, చెరుకూరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏలూరి పాల్గొన్నారు. ఆయా గ్రామాలు కాలనీలకు చేరుకున్న ఏలూరికి ప్రజలు హారతులతో ఘనస్వాగంతం పలికారు. ఆప్యాయంగా పలుకురిస్తూ వృద్ధులు, మహిళలు, యువకులు మా మద్దతు మీకే అంటూ భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ వైసీపీ ఐదేశ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఎవరికి సమస్యలను చెప్పుకోవాలో పాలుపోని స్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. కాలనీలలో సమస్యలు జఠిలంగా మారాయని కనీస వసతులకు కూడా నోచుకోని స్థితిలో పరిస్థితి ఉందన్నారు. ఒక అవకాశం ఇవ్వండి అని బతిమాలి ఓట్లు దండుకున్న జగన్‌రెడ్డి ప్రజాభవనం కూల్చడం దగ్గర నుంచి మొదలుపెట్టిన విధ్వంస పాలన ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చిందన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి నెలకొందన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మందుతో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నారన్నారు. కనీసం ప్రజలకు తాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో జగన్‌రెడ్డి పాలన ఉందన్నారు. ఎక్కడ చూసినా కలుషిత నీరే దిక్కుగా మారిందని అయినా పట్టించుకునే వారే లేరన్నారు. గ్రామాల నుంచి మహా నగరాల వరకూ ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైనా కనీసం మరమ్మతు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పర్చూరు కారంచేడు వాగు అభివృద్ధి పేరుతో మట్టిని అమ్మేసుకుని కట్టలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో గత తుఫాన్‌తో సంభవించిన వరదలకు వేల ఎకరాల్లోని పంటలు నీటపాలయ్యాయన్నారు. పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకు వచ్చేవిదంగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజా కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏలూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:56 PM