Share News

అత్యాచార నిందితుడి అరెస్ట్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:25 AM

టంగుటూరు వాణీనగర్‌లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇత్తడి విజయ్‌కుమార్‌ను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నార్త్‌బైపాస్‌ రోడ్డులో అరెస్ట్‌ చేశామని కనిగిరి డీఎస్పీ ఆర్‌. రామరాజు ఆంధ్రజ్యోతికి తెలిపారు.

అత్యాచార నిందితుడి అరెస్ట్‌

టంగుటూరు, జూలై 25 : టంగుటూరు వాణీనగర్‌లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇత్తడి విజయ్‌కుమార్‌ను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నార్త్‌బైపాస్‌ రోడ్డులో అరెస్ట్‌ చేశామని కనిగిరి డీఎస్పీ ఆర్‌. రామరాజు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన విచారణాధికారి గా ఇక్కడకు వచ్చారు. అత్యాచారం జరిగిన ఇంటిని గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.

Updated Date - Jul 26 , 2024 | 12:25 AM