Share News

సైబర్‌ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:15 AM

సైబర్‌ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డీ ఎస్పీ యు.నాగరాజు అన్నారు. స్థానిక ఏ1 గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు.

సైబర్‌ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

మార్కాపురం, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): సైబర్‌ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డీ ఎస్పీ యు.నాగరాజు అన్నారు. స్థానిక ఏ1 గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసు కుని కొందరు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నా రన్నారు. ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులైనందున సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాక సైబర్‌ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుట్టూ సమాజాన్ని విద్యార్థులు జాగృతం చేయాల న్నారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారానే 90 శాతానికి పైగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతు న్నారన్నారు. వాటి కట్టడికి అప్రమత్తత ఒక్కటే మార్గమన్నా రు. మాదక ద్రవ్యాల వినియోగం వైపు వెళ్తే జీవితాలు నాశనం అవుతాయన్నారు. విద్యార్థులు క్షణి క ఆవేశాలకు దూరంగా ఉండాల న్నారు. మార్కాపురం సీఐ పి.సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు ఎక్కువయ్యాయన్నారు. విశృంఖల, పాశవికమైన ఆలోచనా విధానాల వలన ఈ దురాగతాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వాటిని కట్టడికి చట్టాల ద్వారానే కాక మనుషుల మస్తిస్కాల్లో మార్పులు రావాల్సి వుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, కాలేజీ డైరెక్టర్‌ మీర్జా మహమ్మద్‌ మసూద్‌ అలీబేగ్‌, రూరల్‌ ఎస్సై అంకమ్మరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:15 AM