Share News

మూడు ద్విచక్రవాహనాలు దహనం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:53 PM

మండలంలోని కోనంకి గ్రామంలో షేక్‌ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్‌ మస్తానవలి మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్‌లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు.

    మూడు ద్విచక్రవాహనాలు దహనం
కాలిపోయిన ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి

మార్టూరు, జూలై 26: మండలంలోని కోనంకి గ్రామంలో షేక్‌ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్‌ మస్తానవలి మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్‌లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు. అయితే ఈ ఇంటిలో ఖాజావలి కుటుంబం నివశించడం లేదు. ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంటిలో వారు ఉంటున్నారు. ఆ ఇంటి వరండాలో అతని బంధువులకు చెందిన మరో రెండు ద్విచక్రవాహనాలు కూడా ఉంచారు. దాంతో గుర్తుతెలియని వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలను, సోడాబండిని దహనం చేశారు.అనంతరం ఈ మంటలు వ్యాపించి ఇంటి కరెంటు మీటరు, వైర్లతో పాటు ఇంటిలోపల బీరువా, దుస్తులు కూడా కాలిపోయాయి. అయితే పెద్దగా శబ్దాలు రావడం, మంటలు వ్యాపించడంతో ఇంటి ఎదురుగా మరో ఇంటిలో నివసిస్తున్న ఖాజావలి కుమారుడు మస్తానవలి ఇంటినుంచి బయటకు వచ్చి సమీపంలోని బంధువులను పిలిపించి మంటలను ఆర్పివేయించాడు.కాని అప్పటికే పూర్తిగా నష్టం జరిగింది.ఈ ప్రమాదం కాకుండా సమీపంలోని మరో ఇంటిముందు ఉన్న స్కూటీని,ఇంటిలోని సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకు పోయారు.వారు దొంగతనం చేసి వెళుతూ ఈ అగ్నిప్రమాదం చేసి ఉంటారని షేక్‌ మస్తానవలి అనుమానంతో స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి బాపట్లనుంచి క్లూస్‌టీం బృందం రాగా వారు వేలిముద్రలను సేకరించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:53 PM