Share News

RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:21 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది...

RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..

తిరుమల: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. దీనిపై తొలిసారిగా ఆమె స్పందించారు. తిరుమల శ్రీవారిని రోజా ఇవాళ దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటనల పట్ల ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.


ముచ్చుమర్రిలో ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని విమర్శించారు. గుడ్లవల్లేరులోని హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఫిర్యాదు చేసినా ఏమి జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వ హయంలో ర్యాగింగ్ విపరీతంగా పెరిగిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పైన పెట్టిన దృష్టిని పక్కన పెట్టి.. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంపై దృష్టి సారించాలని రోజా విమర్శించారు. పార్టీలు మారే వారిని ప్రజలు విశ్వసించరని అన్నారు ఎంత మంది పార్టీని వీడినా వైసీపీకీ వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రోజా వారానికోసారి తిరుమలను దర్శించుకునేవారు. పైగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడల్లా రాజకీయ విమర్శలను ఎక్కుపెడుతూనే ఉండేవారు.


అప్పట్లో రోజాపై తిరుమలలో చేస్తున్న రాజకీయ విమర్శలపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయినా సరే రోజా ఇప్పటికీ తన తీరును మాత్రం మార్చుకోలేదు. ఓటమి పాలయ్యాక మాత్రం తిరుమలకు రోజా పెద్దగా వచ్చిందే లేదు. ఇన్నాళ్లకు వచ్చి కూడా ఆమె రాజకీయ విమర్శలకు పాల్పడటం పట్ల భక్తుల నుంచి.. రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే దానికి సంబంధించి ఊసే లేదు కానీ రాజకీయ విమర్శలేంటని మండిపడుతున్నారు. రోజా ఓటమి పాలైనా కూడా ఆమెకు వివరం మాత్రం రాలేదని అంటున్నారు. మొత్తానికి రోజా అయితే పార్టీ మారే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు.

Updated Date - Aug 31 , 2024 | 12:32 PM