Shivraj Singh Chouhan : మోదీ, బాబు అండగా ఉంటారు
ABN , Publish Date - Sep 07 , 2024 | 03:26 AM
రైతులు ఎవ రూ అధైర్య పడొద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అండగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.
రైతులు ఎవరూ అధైర్య పడొద్దు
అన్ని విధాలుగా సాయం చేస్తాం
ఎరువులు, విత్తనాలు అందజేస్తాం
వైసీపీ సర్కారు ‘ఫసల్ బీమా’కు
ప్రీమియం కట్టకపోవడంతో
రైతులకు నష్టం: శివరాజ్ సింగ్
తెనాలి/అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి),గన్నవరం: రైతులు ఎవ రూ అధైర్య పడొద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అండగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేయాలని కేంద్రం తనను పంపిందన్నారు. ఏ ఒక్కరూ కన్నీరు కార్చొద్దని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతుల జీవితాల్లో మళ్లీ వెలుగులు తెస్తామని చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను చౌహాన్ పరిశీలించారు. అనంతరం ఎస్‌ఎల్‌వీ లైలా గ్రీన్ మెడోస్ దగ్గర రైతులతో మాట్లాడారు. రైతు పలగాని శ్రీనివాసరావు మంత్రి ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను 30 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని, బుడమేరు వరదతో మునిగి పోయి కుళ్లిపోయిందని తెలిపారు. కేంద్ర మంత్రికి వరి దుబ్బులను చూపించారు. భూ యజమానికి రూ.15 వేలు కౌలు ముందుగానే చెల్లించామని చెప్పారు. మరో రైతు చదలవాడ కృష్ణారావు మాట్లాడుతూ.. తాను పది ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తున్నానని, పంట మొత్తం వరదలకు పూర్తిగా మునిగి నష్టపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు.
తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, రోడ్డున పడ్డానని, ఆదుకోవాలని వేడుకున్నారు. కేంద్ర మంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై తనకు సంపూర్ణ అవగా హన ఉందన్నారు. నీళ్లు నిలవడం వల్ల పంట దెబ్బతిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు అన్నీ సమకూరుస్తామని చెప్పారు. తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) రూ.3400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పా రు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఉన్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి ప్రీమియం కట్టకపోవటంతో రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వరద నష్టం వివరాలను ప్రధానికి తెలుపుతానన్నారు. సీఎం చంద్రబాబు సున్నితంగా ఆలోచిస్తారని, మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్లల్లో కన్నీరు వచ్చిందన్నారు.
‘బుడమేరు’కు నిధులివ్వండి: సాగునీటి వినియోగదారుల సమాఖ్య వినతి
బుడమేరు కాలువ పనులకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కో రింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడు తూ.. భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా బుడమేరు కాలువ పనులు చేపట్టాల్సి ఉందని, ఇందుకు కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
కేంద్రం నుంచి అదనపు సాయం: కేంద్ర మంత్రి పెమ్మసాని
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఇందుకు ఆయన సానుకూ