Share News

Andhra Pradesh : మహిళలకు నైపుణ్య శిక్షణ

ABN , Publish Date - May 28 , 2024 | 05:05 AM

మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.

Andhra Pradesh : మహిళలకు నైపుణ్య శిక్షణ

సొంత కాలేజీలో కేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ నేత నారాయణ

నెల్లూరు(విద్య), మే 27: మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.

సోమవారం నెల్లూరు నగరంలో ని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికలకు ముందే 600 మందితో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కేంద్రంలో ప్రతిరోజు 30 మందితో ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఒక బ్యాచ్‌, సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - May 28 , 2024 | 05:06 AM