Duvvada Family: చిందులేసిన దువ్వాడ వాణి
ABN , Publish Date - Sep 07 , 2024 | 06:52 PM
: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు.
శ్రీకాకుళం: దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద వాణి మకాం వేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దివ్వెల మాధురి ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న దువ్వాడ వాణి తీవ్ర స్థాయిలో ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
నెలరోజులుగా ఆందోళన
దువ్వాడ శ్రీనివాస్- వాణి మధ్య పెద్ద మనుషులు సమక్షంలో చర్చలు జరిగాయి. వాణి విధించిన షరతులు అన్నింటికి శ్రీనివాస్ అంగీకరించారు. ప్రస్తుతం ఇంటిని కూతుళ్ల పేరుతో రాయమని చెప్పే అంశంపై మాత్రం వ్యతిరేకించారు. ప్రస్తుతం నేను ఉంటోన్న ఇల్లు అది ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆ ఇంటిని కూడా వదలరా..? ఎన్నిటికైనా కూతుళ్లకే అవుతుంది కదా అని అనడంతో చర్చలకు బ్రేక్ పడింది. ఆ ఇంటి వద్ద గత నెల రోజులుగా కూతురితో కలిసి దువ్వాడ వాణి ఆందోళనకు దిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోండగా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇంతలో దివ్వెల మాధురి రావడం, ఇంట్లోకి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాధురి వెళ్లడంతో
ఇంట్లోకి వెళ్లేందుకు తమకు అనుమతి లేదు కానీ.. మాధురిని ఎలా అనుమతిస్తారని వాణి ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్- మాధురి మధ్య వివాహేతర సంబంధం ఉందని మరోసారి ఆరోపించారు. అందుకే ఆమెకు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని దువ్వాడ వాణి గుర్తుచేశారు. కావాలనే తమను సిబ్బంది అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిని కార్యాలయంగా మార్చుకున్నారు. ఆ ఇంట్లోకి దివ్వెల మాధురి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.