Share News

అధికారంలోకి వచ్చిన వెంటనే..తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

ABN , Publish Date - May 09 , 2024 | 12:28 AM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా డిఫెన్స్‌ అకాడమి, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పలాస నియో జకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తెలిపారు. బుధవారం ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు శిరీష సమాధానాలు చెప్పారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే..తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

(పలాస)

రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా డిఫెన్స్‌ అకాడమి, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పలాస నియో జకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తెలిపారు. బుధవారం ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు శిరీష సమాధానాలు చెప్పారు.

ప్రశ్న: నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తారా?

జవాబు: కచ్చితంగా. ప్రధానంగా ఆఫ్‌షోర్‌ రిజ ర్వాయరు నియోజక వర్గ ప్రజల చిరకాల వాంఛ. దివంగత నేత అప్పయ్యదొర దీన్ని రూపొందించగా, తన తండ్రి గౌతు శివాజి.. గెడ్డం దీక్ష చేసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు నిధులు రప్పించుకున్నారు. తరువాత అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ను నిర్లక్ష్యం చేసింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకూ సాగునీటిని అందిస్తాం. అలాగే, డబారు సింగ్‌, కళింగదళ్‌ కాలువలను ఆధునికీకరించేందుకు ప్రణాళి కలు సిద్ధం చేసుకున్నాం. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తాను. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక వారధిని పూర్తి చేస్తాం. మంచినీళ్ల పేట-నువ్వలరేవు బ్రిడ్జి రోడ్డుకు ఉన్న అవరోధాలు తొల గిస్తాం. కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. కిడ్నీ పరిశోధన కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యాలయానికి కృషి చేసి రోగులకు బాసటగా నిలుస్తాం.

ప్ర: మీ భర్త వ్యాపారులను వేధిస్తారనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత ?

జ: అదంతా అవాస్తవం. ప్రతిసారీ ఎన్నికలు రాగానే నా భర్త వెంకన్నచౌదిరి ప్రస్తావన తీసుకువస్తు న్నారు. వాస్తవాలను వ్యాపారులనే అడిగి తెలుసుకోవాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లాభపడింది ఒక వర్గమే. అదే వర్గం మా ఇమేజిని దెబ్బతీయాలని కుట్రపన్నింది. ప్రస్తు తం పలాస నియోజకవర్గ ప్రజలు నిజాన్ని గుర్తించారు. మా పార్టీలో చేరుతున్న వారిలో వ్యాపారులే అధికంగా ఉండడం ఇందుకు ఉదాహరణ.

ప్ర: మీరు లోకలా.. నాన్‌ లోకలా?

జ: నేను పక్కా లోకల్‌. నా తాత గౌతు లచ్చన్న, తండ్రి గౌతు శివాజి సోంపేట మండలంలో జన్మించారు. నేను కూడా అక్కడే పుట్టిపెరిగాను. నా తాత తండ్రుల ఆస్తులు సైతం నియోజకవర్గంలోని మందసలో ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్లానే తప్పా నేను పక్కా లోకల్‌. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆడబిడ్డనే. నా ధృవపత్రాలన్నీ గౌతు పేరుతోనే ఉంటాయి. ప్రస్తుతం పలాస మండలం శాసనం పంచాయతీ పరిధిలో సొంత స్థలాన్ని కొనుగోలు చేసుకొని అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నా. నేను లోకల్‌ కాదన్న వారికి ఇదే నా సమాధానం. పొరుగు మండలంలో పుట్టిన మంత్రి అప్పలరాజు ఇక్కడ నివాసం ఏర్పచుచుకొని లోకల్‌గా చెలామణి అవ్వడం లేదా.?

ప్ర: వైసీపీ నాయకులు భూములను ఆక్రమించుకున్నట్లు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా?

జ: అన్ని ఆధారాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు, కాలువలు, ప్రైవేటు స్థలాలను వైసీపీ నేతలు ఆక్రమించారు. పేర్లతో సహా ఆధారాలు మొత్తం జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం. జిరాయతీ స్థలాలకు రక్షణ వలయంగా ఉంటాం. ఆక్రమణదారులపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెడతాం.

ప్ర: ఎలుగుబంట్ల నుంచి ప్రజలను కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

జ: వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగు బంట్ల సంచారం ఎక్కువగా ఉంది. అవి ప్రజలపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. కొండలను ఆక్రమించడంతో అవి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయని అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. దీనికితోడు అధిక వేడి కావడంతో నీటి కోసం గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. వీటిని అరికట్టడానికి ముందుగా కొండలపై పచ్చని మొక్కలను పెంచి వాటికి రక్షణ కల్పి స్తాం. కొండ ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంతో పాటు ఆహారం అందేలా చర్యలు చేపడతాం.

ప్ర: గత ఎన్నికల్లో ఓటమితో మనోస్థైర్యం కోల్పోయారా?

జ: లేదు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తరు వాత మనోస్థైర్యం దెబ్బతినలేదు. నా పని నేను చేసుకోవడం, ప్రజా సమస్యలపై స్పందించడం, తెలుగుదేశం పథకాలపై ప్రచారాలు చేసుకొని సిద్ధం కావాలని యోచించాను. కానీ, వైసీపీ నాయకులు నాపై, నా కుటుంబంపై కక్షగట్టి వికృత చేష్టలకు పాల్పడ్డారు. నా అనుచరులను కేసుల్లో ఇరికించి మానసికంగా ఇబ్బందికి గురిచేశారు. నాపై తప్పుగా సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్టారు. వారి చేష్టలకు ఎంతో బాధ పడ్డాను. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వైసీపీ నాయకులకే సపోర్టు చేశారు. ఒకరిద్దరు అధికారులు కూడా వైసీపీ నేతలకు తొత్తులుగా మారారు. అయినా నా మనోస్థైర్యం కొంచెంకూడా సడలలేదు. సిక్కోలు సివంగి ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం వారికి ట్రైలర్‌ మాత్రమే చూపించాను. ముందుంది ముసళ్ల పండుగ. తెలుగు మహిళకు పౌరుషం వస్తే ఏ విధంగా ఉంటుందో అనేది ఎన్నికల తరువాత చూపిస్తా.

ప్ర: ఉమ్మడి మేనిఫెస్టోపై స్పందన ఎలా ఉంది?

జ: సూపర్‌గా ఉంది. మేనిఫెస్టోకు సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళితే వస్తున్న జనాలే ఇందుకు నిదర్శనం. సూపర్‌సిక్స్‌ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. రానున్నది కూటమి ప్రభుత్వమే.

(పలాస)

Updated Date - May 09 , 2024 | 12:28 AM