Share News

గంజాయి బారిన పడొద్దు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:28 PM

: గంజాయి మహమ్మారిబారిన పడొద్దని సీఐ నల్లి సాయి అన్నారు.

గంజాయి బారిన పడొద్దు
పాతపట్నం మానవహారం నిర్వహించిన విద్యార్థినీ విద్యార్థులు

పాతపట్నం: గంజాయి మహమ్మారిబారిన పడొద్దని సీఐ నల్లి సాయి అన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాల వినియోగాలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో పాతప ట్నంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ కూడలి వద్ద మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏఐవై ఎఫ్‌ నాయకుడు వెంకటరావు మాట్లాడుతూ.. ఒడిశా సరి హద్దు ప్రాంతమైన పాతపట్నంలో గంజాయితోపాటు ఖైనీ గుట్కా తదితర నిషేధిత ఉత్పత్తులు యథేచ్ఛగా జరుగు తున్నాయని, వీటిని పోలీసులు అడ్డుకోవాలని కోరారు. ఎస్‌ఐ మహమ్మద్‌ యాశిన్‌ మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగాలతో అనారోగ్యానికి గురై జీవిత మాధు ర్యాన్ని అనుభవించేందుకు పనికిరాకుండా పోతారన్నారు. ఎక్క డ మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నా పోలీసుల దృష్టి కి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కిరణ్మయి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, ఏఐవైఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మారాలి

ఎల్‌.ఎన్‌.పేట: రాష్ట్రం డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మారాలని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు. లక్ష్మినర్సుపేట జంక్షన్‌లో శుక్ర వారం స్థానికులకు డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవ గాహన కలిగించారు. డ్రగ్స్‌ వాడకం వల్ల ఆరోగ్యం చెడి పోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:28 PM