Share News

సామాజిక వర్గాల ఓటర్లకు గేలం

ABN , Publish Date - May 09 , 2024 | 12:33 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండడంతో రాజకీయపార్టీల అభ్యర్థులు సా మాజిక వర్గాల ఓటర్లకు గేలంవేసే పనిలో పడ్డారు. ప్రధాన సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ మేరకు ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాలు ఏర్పాటుచేసి, అండగా నిలవాలని కోరుతున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాల నాయకుల నేతృ త్వంలో సమావేశాలు ఏర్పాటుచేసి తమకు ఓట్లువేసి శాసనసభ, పార్లమెంట్లకు పంపా లని కోరుతున్నారు. మీకు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. తాము అధికారం లోకి వస్తే అమలుచేసే పథకాలను వివరిస్తున్నారు. వైశ్య, వెలమ, రెడ్డిక, యాదవ తదితర అధిక ఓట్లు ఉన్న సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమానికి భరోసా ఇస్తామని హామీ ఇస్తూ ఎన్నికల్లో ఓట్లు వేసేలా చూడాలని కోరుతున్నారు.

సామాజిక వర్గాల ఓటర్లకు గేలం

నందిగాం/పలాస: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండడంతో రాజకీయపార్టీల అభ్యర్థులు సా మాజిక వర్గాల ఓటర్లకు గేలంవేసే పనిలో పడ్డారు. ప్రధాన సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ మేరకు ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాలు ఏర్పాటుచేసి, అండగా నిలవాలని కోరుతున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాల నాయకుల నేతృ త్వంలో సమావేశాలు ఏర్పాటుచేసి తమకు ఓట్లువేసి శాసనసభ, పార్లమెంట్లకు పంపా లని కోరుతున్నారు. మీకు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. తాము అధికారం లోకి వస్తే అమలుచేసే పథకాలను వివరిస్తున్నారు. వైశ్య, వెలమ, రెడ్డిక, యాదవ తదితర అధిక ఓట్లు ఉన్న సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమానికి భరోసా ఇస్తామని హామీ ఇస్తూ ఎన్నికల్లో ఓట్లు వేసేలా చూడాలని కోరుతున్నారు.

ఓట్ల కోసం ప్రమాణాలు..

సామాజిక వర్గాలకు వైసీపీ నాయకులు భారీగా తాయిలాలు ప్రకటిస్తుండడంతో పాటు వారితో తమ పార్టీకే ఓటు వేయాలని దేవుని ఎదుట ప్రమాణాలు చేయిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓ మత్స్యకార గ్రామంలో సోమవారం సాయంత్రం కొంద రు మత్స్యకారులతో వైసీపీ నాయకులు ప్రమాణం చేయించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలో మత్స్యకారులు మొత్తం మూడు వర్గా లుగా ఉన్నారు. ఇందులో ఓ వర్గం వైసీపీకి అను కూలంగా ఉండగా, మిగిలిన రెండు వర్గాలు టీడీపీ- జనసేన కూటమికి వైపు ఉన్నాయి. ప్రధానంగా 500 ఓట్లు అధికార పార్టీకి చెందిన అగ్రనాయకుల సామా జిక వర్గానికి చెందినవి. దీంతో వైసీపీకి తప్పనిసరిగా వేయాలని అక్కడ నాయకులు సూచించారట. అయితే ఈ ఓటర్లలో టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండడంతో ఎందుకొచ్చిన గొడవని వారికి ప్యాకేజీ ప్రకటించడంతోపాటు వైసీపీకే ఓటు వేసే విధంగా ఏకంగా గుడిలోనే సత్యప్రమాణాలు చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - May 09 , 2024 | 12:33 AM