Share News

ఓటుకు ఎంతిద్దాం?

ABN , Publish Date - May 08 , 2024 | 12:07 AM

ఈసారి ఓటుకు ఎంతిస్తాం అన్న దగ్గర రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏదైనా పార్టీ నాయకులు ఇచ్చిన తర్వాతే మనమూ ఇద్దాములే అని మిగతా పార్టీ నేతలు చూస్తున్నారు. ఎవరు ముందు డబ్బులు పంపిణీ చేస్తారా? అంటూ వారు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లోని ఓటరుకు ఒకరేటు, పట్టణాల్లోని ఓటరుకు ఒకరేటు ఇద్దాములే అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. డబ్బులు ఎలా పంపిణీ చేయాలి, ఓటరుకు స్లిప్పుతో కలిపి ఇస్తామా, ముందే ఇస్తామా అని ఆయా పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు. డబ్బులతో పాటు మందుబుడ్డీ ఇవ్వకతప్పదు. ఎప్పటికైనా ఇవ్వాలి కదా మన ఓటరు ఎవరో గుర్తించండి పంపిణీ చేద్దామంటూ చెప్పు కుంటున్నారు. బూత్‌లవారీగా పరిశీలించి లిస్ట్‌లను కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. ఏ రాజ కీయ పార్టీ వారు డబ్బులిచ్చినా తీసుకుందాం అంటూ ఓటర్లు సిద్ధమవుతున్నారు.

ఓటుకు ఎంతిద్దాం?

(టెక్కలి)

ఇంటర్వ్యూ

Updated Date - May 08 , 2024 | 12:07 AM