Share News

విచారణ కాదు.. న్యాయం చేయండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:30 PM

ఉద్యోగం పేరుతో మోసపో యాయమని, విచారణతో కాలయాపన చేయకుండా న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడు కున్నారు.

విచారణ కాదు.. న్యాయం చేయండి
నిరసన తెలుపుతున్న బాధితులు

- ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు

- పంచాయతీ కార్యదర్శిపై కొనసాగిన విచారణ

- మా వాదన వినాలన్న మరికొందరు.. పట్టించుకోని అధికారులు

శ్రీకాకుళం క్రైం: ఉద్యోగం పేరుతో మోసపో యాయమని, విచారణతో కాలయాపన చేయకుండా న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడు కున్నారు. మందస మండలం లోహరిబంద గ్రామ పంచాయతీ కార్యదర్శి మన్నం సతీష్‌బాబుపై ‘మీ కోసం’లో ఆరుగురు బాధితులు ఉద్యోగాల పేరుతో మోసపోయామని, న్యాయం చేయాలని అర్జీ పెట్టుకో వడంతో అతడిపై విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్‌ కార్యాలయం లో జడ్పీ సీఈవో డి.వెంకటేశ్వరరావు, డీపీవో కె.వెంక టేశ్వరరావు ఆధ్వర్యంలో సతీష్‌బాబును విచారించా రు. సతీష్‌బాబు మోసాలపై ఫిర్యాదు చేసిన ఆరు గురితో పాటు శ్రీకాకుళం నగరానికి చెందిన సుమా రు 30 మంది బాధితులు జిల్లా పరిషత్‌లో విచారణ కు హాజరయ్యారు. ఈ విచారణలో బాధితులైన ప్రి యానందం, ప్రవీణ్‌కుమార్‌, పి.నరేష్‌కుమార్‌, జి.గౌరీ శంకర్‌, టి.లీలాసాయి కృష్ణలను డీపీవో, జడ్పీ సీఈ వోలు విచారించారు. వీరిని ఉద్యోగాల పేరుతో సతీష్‌ బాబు మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై సతీష్‌బాబు లిఖితపూర్వకంగా తాను ఉద్యో గాల పేరుతో ఈ ఆరుగురు నుంచి నగదు వసూలు చేశానని, వారికి నగదు తిరిగి ఇచ్చేస్తానని అంగీకరిస్తూ అధికారులకు రాసి ఇచ్చాడు. ఈ మేరకు సతీష్‌బాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని కలెక్టర్‌కు నివేదించనున్నారు.

ఫిర్యాదుదారులకే అవకాశంపై ఆందోళన

ఉద్యోగల పేరుతో మోసపోయమంటూ కలెక్టర్‌ నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదు చే సిన ఆరుగురు బాధితులకే జడ్పీ కార్యాలయంలో వి చారణ అవకాశం ఇవ్వడం తగదని, సతీష్‌బాబు మో సాల బారిన పడిన ఎందరో బాధితులు ఉన్నారని, వారిని కూడా విచారించి నివేదిక తీసుకోకపోవడం అన్యాయమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మీకోసంలో ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల వివరణ మాత్రమే అధికారులు తీసుకోగా సతీష్‌బాబు మోసాల బారిన పడిన సుమారు 30 మంది బాధితులు జడ్పీ కార్యాలయానికి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు చేరుకున్నారు. అయితే అధికారులు ఆరుగురు బాధితులను తప్ప మరెవరీ ఘోషను వినకపోవడంతో బాధితులు ఆందోళన చే పట్టారు. ఇదే క్రమంలో మోసం చేసిన సతీష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో మహిళా బాధితులు అతడి చొక్కా పట్టుకుని నిలదీశారు. ఇదిలా ఉంటే విచార ణాధికారులు మాత్రం బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని, అప్పుడే వాంగ్మూలాన్ని నమోదు చేసి కలెక్టర్‌కు అందిస్తామని చెప్పడంతో వారంతా అస హనం వ్యక్తం చేశారు. ఉదయం 10 గం టలకు జడ్పీ కార్యాలయంలో ప్రారంభ మైన విచారణ రాత్రి 7.00 గంటల వర కు సాగింది. అయితే బాధితులు తాము ఎస్పీ కార్యాల యంలో ఫిర్యాదు చేశామ ని, తమకు విచారణలో అవకాశం కల్పిం చలేదని, ఉన్న ఆరుగురితో విచారణ జరిపించడం కన్నా, బాధితులందరికీ న్యా యం చేయాలని వారు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కోరారు.

Updated Date - Jul 26 , 2024 | 11:30 PM