Share News

పోలీసైనా నో ఎంట్రీ..

ABN , Publish Date - May 09 , 2024 | 12:32 AM

ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా జరగాలంటే పోలీసులదే కీలక పాత్ర. అభ్యర్థుల ప్రచారాలు, సభలు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. పోలింగ్‌ రోజు ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా బందోబస్తు నిర్వహిస్తారు. అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రం లోపలకి వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా సాధ్యమైనంత వరకు కేంద్రంలోని ఎన్నికల అధికారే సిబ్బందితో ఆయా సమస్యను పరిష్కరించుకుంటారు. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ప్రత్యేక కారణం లేకుండా పోలీసులు బూత్‌లోకి పోవడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి అయినా, ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చినా వారి భద్రత సిబ్బంది మాత్రం పోలింగ్‌ కేంద్రం బయటే ఆగాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ వారి అనుచరులు కానీ చేయకూడదు. పోటీలో ఉన్న అభ్యర్థి జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ ఉన్నా వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్‌ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్‌ కేంద్రం లోపలకు వెళ్లకూడదు. పదవుల్లో ఉన్నవారు పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను ప్రభావతం చేసేలా ప్రవర్తించకూడదు. ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్‌ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలు పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం అనుమతి పత్రం ఉంటేనే కేంద్రంలోకి అనుమతించా

 పోలీసైనా నో ఎంట్రీ..

(హిరమండలం/నరసన్నపేట)

ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా జరగాలంటే పోలీసులదే కీలక పాత్ర. అభ్యర్థుల ప్రచారాలు, సభలు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. పోలింగ్‌ రోజు ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా బందోబస్తు నిర్వహిస్తారు. అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రం లోపలకి వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా సాధ్యమైనంత వరకు కేంద్రంలోని ఎన్నికల అధికారే సిబ్బందితో ఆయా సమస్యను పరిష్కరించుకుంటారు. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ప్రత్యేక కారణం లేకుండా పోలీసులు బూత్‌లోకి పోవడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి అయినా, ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చినా వారి భద్రత సిబ్బంది మాత్రం పోలింగ్‌ కేంద్రం బయటే ఆగాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ వారి అనుచరులు కానీ చేయకూడదు. పోటీలో ఉన్న అభ్యర్థి జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ ఉన్నా వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్‌ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్‌ కేంద్రం లోపలకు వెళ్లకూడదు. పదవుల్లో ఉన్నవారు పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను ప్రభావతం చేసేలా ప్రవర్తించకూడదు. ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్‌ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలు పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం అనుమతి పత్రం ఉంటేనే కేంద్రంలోకి అనుమతించాలి.

Updated Date - May 09 , 2024 | 12:32 AM