Share News

రాజకీయ కట్టప్పలు

ABN , Publish Date - May 09 , 2024 | 12:35 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు రస వత్తరంగా మారుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలు ప్ర చారాన్ని ముమ్మరంచేశాయి. ఈనేపథ్యంలో ఎవరికి వారే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నా, అంతర్గతంగా కోవర్టుల భయం వెంటాడుతోంది. స్వపక్షంలోనే ఉండి పనిచేసే కన్నా ప్రత్యర్థి వర్గంలోకి చేరి వారి అనుపానులను చేరవేయడం ఓ కోవర్టు రాజకీయం. స్వపక్షంలోనే కొనసాగుతూ వారి వ్యూహాలను ప్రత్యర్థి పార్టీకి చేరవేయడం మరో కోవర్టు కళ. రాజకీయ పార్టీల గెలుపు ఎత్తుల్లో ఇది కూడా ఓ వ్యూహమే. పార్టీలోకి వచ్చే వారిని కాదనలేరు. అలా అని అందరినీ కోవర్టులుగా చూడలేరు. ఒకరిద్దరు మాత్రం ఈ తరహా వ్యక్తులు కచ్చితంగా ఉంటారని నేతలే నమ్ముతున్నారు. ఒకవిధంగా వీరంతా రాజకీయ కట్టప్పలు. ఎప్పుడు వెన్నుపోటు పోడుస్తారో చెప్పలేం. వచ్చిన చిక్కల్లా ఆ కోవర్టులను ఎలా పసిగట్టడం అనేది మాత్రమే. దీంతో ఏం మాట్లాడితే.. ఏమవుతుందోనని అభ్యర్థులు భయాందోళన చెందుతున్నారు. తమతో సన్నిహి తంగా ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో రహస్య సమాచారాన్ని పంచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ఉదయం ఒక పార్టీలో ఉంటే, సాయంత్రం వేరే పార్టీ కండువాతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు సన్నిహితులో, ఎవరు పార్టీ విధేయులో, ఎవరు నమ్మక ద్రోహులో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ బెడద మరీ ఎక్కువగా ఉంది. అప్పటి వరకు తనతో ఉండే నేతలు, కార్యకర్తలను ఏదో ఒక ఎరవేసి, ఇతర పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. ఈ పరిస్ధితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రాజకీయ కట్టప్పలు

(రణస్థలం)

కోవర్టులు రకరకాలు..

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా కోవర్ట్‌ ఆపరేషన్‌ చేపడుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రత్యర్థి శిబిరంలోనే ఉంచి దెబ్బతీయడం. ఇటీవల ఓ అభ్యర్థి వద్దకు ద్వితీయ శ్రేణి నేత ఒకరు తాను ప్రస్తుతం ఉన్న పార్టీని వదిలేసి మీ గూటికి వస్తానని వర్తమానం పంపారు. ఆ అభ్యర్థి మాత్రం పార్టీ మారేకంటే అక్కడే ఉండి వారి పథక రచనలన్నీ తనకు చేరవేయాలని... ఇదే తనకు చేసే మేలు అని చెప్పారు. అంతే అటు పార్టీ మారినట్లయింది. ఇటు కోవర్ట్‌ ఆపరేషన్‌ మొదలయ్యింది. ఆవల శిబిరంలోకి వెళ్లి వారి నేతలు, కార్యకర్తలతో మమేకమైపోయి... వారి వ్యవహారాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా తన సొంత శిబిరం నేతలకు చేర్చడం ఇదో రకం కోవర్టు వ్యవహారం. వీరు తటస్థంగా ఉన్నట్లు కలరింగ్‌ ఇస్తూ ఏదో ఒక పక్షానికి లోపాయికారిగా పనిచేస్తారు. పోలీసులు నేరుగా డబ్బు ఉన్న చోటుకు వెళి కొన్ని సందర్భాల్లో దాడులు చేస్తుంటారు. ఇదంతా ఈ తటస్థ కోవర్టుల పుణ్యమే. ఇలా కోవర్టులందు రకాలు వేరయా అన్న చందాన వీరితో పెను ప్రమాదం కూడా అభ్యర్థులకు పొంచి ఉందండోయ్‌.

నేతల్లో టెన్షన్‌..

రాజకీయం అంటేనే ఎదుటి వారి బలాలు, బలహీనతలు తెలుసుకుని వాటికి అనుగుణంగా గెలుపు వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. కానీ నిన్న మొన్నటి వరకు తమ వెంట తిరిగిన వారు ఇప్పుడు ఆవలి పక్షాన కనబడుతుండే సరికి వారిలో టెన్షన్‌ అధికమవుతోంది. వారి లోగట్టులన్నీ ఆ నేతలకు తెలిసి ఉండడమే అందుకు కారణం. తన అంతరంగీకులుగా మెలిగే ఒకరిద్దరు నేతల వద్ద మాత్రమే ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన వివరాలు పంచుకుంటున్నారు. గోడలకు చెవులు ఉండొచ్చు అనే చందాన అత్యంత రహస్యంగా ఎన్నికల ప్రణాళికలకు పదును పెడుతూ కోవర్టు రాజకీయాలకు చెక్‌ పెట్టాలనే తలంపుతో నేతలు ఉన్నారు.

వ్యూహాలను బెడిసికొట్టేలా..

ప్రచారం హోరెత్తించడం ఒక ఎత్తయితే, ప్రత్యర్థి పార్టీ ఎత్తులను చిత్తు చేయడం మరో ఎత్తు. ఇందుకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ, ఎదుటి పార్టీ వ్యూహాలను బెడిసి కొట్టేలా వ్యూహరచన చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు చేపట్టే రహస్య కార్యక్రమాలు తెలుసుకునేలా టార్గెట్‌ చేస్తున్నారు. ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేయడం ద్వారానే విజయానికి చేరువకావచ్చని భావిస్తున్నారు.

నోరు అదుపులో లేకుంటే ఇబ్బందే..

వాక్‌స్వాతంత్య్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేందుకు వీల్లేని పరిస్థితి నెల కొంది. ప్రస్తుతం ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సివస్తోంది. నోరు అదుపులో పెట్టుకో కపోతే ఇబ్బందులు తప్పవని అభ్యర్థులకు అనుచరులు సూచిస్తున్నారు. లేదంటే తగినమూ ల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యులతో సమావేశమైనప్పుడు తప్పితే, ఎక్కడపడితే అక్కడ విలువైన సమాచారాన్ని లీక్‌ చేస్తేందుకు భయపడుతున్నారు. ప్రచారంఘట్టం సమీపిస్తుండడంతో చివరి అంకంగా ఓటర్లకు మద్యం, డబ్బుతో ఆకట్టుకోవల్సి ఉంటుంది. వీటిని అభ్యర్థులు తన ప్రధాన అనుచరులకు మాత్రమే చెబుతున్నారు. బయటకు లీకైతే కోవర్టుల ద్వారా నిఘా బృందానికి సమాచారం చేరే అవకా శంలేకపోలేదు.దీంతో కోవర్టుల విషయంలో అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీనికితోడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ప్రతి విషయం ఎన్నికల కమిషన్‌ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ప్రధాన కూడళ్లలో పోలీసు చెక్‌పోస్టులు కూడా ఏర్పాటయ్యాయి. జిల్లాలో అక్కడక్కడ అనుమతుల్లేకుండా నగదు, మద్యం తదితర వాటిని తరలిస్తూ పట్టుబడుతున్నారు. పోలీసుల కళ్లగప్పి క్షేత్రస్థాయిలోకి తాయిలాలను చేర్చడం సులువైన పనికాదు. పోటీ నువ్వా నేనా ఉండే నియోజకవర్గాల్లో పోలీసుల నిఘా కంటే ప్రత్యర్థుల నిఘా ఎక్కువగా ఉంది. ప్రత్యర్థి విజయావకాశాలను దెబ్బతీసే కార్యక్రమాలను కూడా పదునుపెడుతున్నారు.

భలే అవకాశవాదం..

కోవర్ట్‌లకు మరో అవకాశం కూడా ఉంది. ప్రత్యర్థి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసినా.. సొంత పార్టీ గెలిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఈ విజయం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుని ఎంచక్కా ఆ నేత నీడలోనే ఉండొచ్చు. ఇలా కాకుండా ఎవరికోసమైతే కోవర్టు అవతారమెత్తారో వారే గెలిస్తే దర్జాగా మళ్లీ వారి దగ్గరకు వెళ్లిపోయి అక్కడా గెలుపు క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే సౌలభ్యం కోవర్టులకు మాత్రమే ఉంది.

Updated Date - May 09 , 2024 | 12:35 AM