Share News

రాజకీయ తొలగింపులు ఆపాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:32 PM

మధ్యా హ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాజకీయ తొలగింపులు ఆపాలని సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షులు కె.నాగ మణి, యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు.

రాజకీయ తొలగింపులు ఆపాలి

అరసవల్లి: మధ్యా హ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాజకీయ తొలగింపులు ఆపాలని సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షులు కె.నాగ మణి, యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరావుకు డీఈవో కార్యాలయం వద్ద శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడు వంట కార్మికులను రాజకీయ కక్ష సాధింపు చర్యలతో తొలగించడం జరుగుతోందని తెలిపా రు. బిల్లులు, వేతనాలు సకాలంలో రాకపోయినా సరే వడ్డీలకు అప్పుచేసి ఈ పథకా న్ని నడిపిస్తున్నామన్నారు. ఇప్పుడు ఇలా ఉద్యోగంలో నుంచి తొలగించడం అన్యాయ మని వాపోయారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఉత్తర, కె.సుశీల, జి.పద్మావతి, బి.విజయ, ఆర్‌.లక్ష్మి, ఎం.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:32 PM