Share News

సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:29 AM

‘ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్‌ సూచనలు శతశాతం పాటించాల’ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సెక్టోరియల్‌ అధికారులకు ఈవీఎంల నిర్వహణ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు.

సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, మే 8: ‘ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్‌ సూచనలు శతశాతం పాటించాల’ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సెక్టోరియల్‌ అధికారులకు ఈవీఎంల నిర్వహణ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. రిసెప్షన్‌, స్ర్టాంగ్‌రూమ్‌ భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ‘సెక్టోరియల్‌ అధికారులకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 72గంటల ప్రొటోకాల్‌ చాలా కీలకం. మీ కేంద్రాలకు వెళ్లి ఎటువంటి సమస్యలు ఉన్నా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సమయపాలన పాటించాలి. పోలింగ్‌ మెటీరియల్‌ పూర్తి స్థాయిలో తీసుకున్నదీ లేనిదీ చెక్‌లిస్టు ద్వారా పరిశీలించుకోవాలి’ అని కలెక్టర్‌ సూచించారు.

- ‘చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన స్ట్రాంగ్‌రూమ్‌లకు బస్సుల్లో జాగ్రత్తగా తీసకువెళ్లేలా చూడాల’ని సెక్టోరియల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎక్కడికక్కడ సైనేజ్‌ బోర్డులు, లైటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆర్వోలు కౌంట్‌ చేసుకుని అన్ని వాహనాలు సులువుగా వచ్చేలా.. ట్రాఫిక్‌ రద్దీ లేకుండా చూడాలన్నారు. కేటాయించిన రూట్ల ద్వారా నిర్ణయించిన పార్కింగ్‌ స్థలం వద్దకే వాహనాలు చేరుకోవాలని సూచించారు.

- జేసీ ఎం.నవీన్‌ మాట్లాడుతూ.. ‘సెక్టోరియల్‌ అధికారులు ఎన్నికల రోజున అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి రిపోర్టులను కంట్రోల్‌ రూమ్‌కు అందజేయాలి. ఏదైనా కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలి. ఈవీఎంలలో సమస్య తలెత్తితే రిజర్వ్‌ పరికరాలతో వాటిని భర్తీ చేయాలి’ అని తెలిపారు. నియోజకవర్గాలకు సంబంధించి సైనేజెస్‌ ఏర్పాటు చేస్తామని.. జాగ్రత్తగా వాహనాలు చేర్చాలని సూచించారు.

- మున్సిపల్‌ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డీఆర్వో ఎం.గణపతిరావు, ఏఎస్పీ ప్రేమ్‌ కాజల్‌, ఆర్వోలు భరత్‌ నాయక్‌, సీహెచ్‌ రంగయ్య, రామ్మోహన్‌, నోడల్‌ అధికారి బాలాజీ నాయక్‌, మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరి, ఎన్‌ఐసీ కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:29 AM