Share News

ఆగిన పనులు పూర్తి చేయిస్తా

ABN , Publish Date - May 08 , 2024 | 12:09 AM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ రాక్షస పాలనకు అంతం తప్పదని నరసన్నపేట నియోజవకర్గ టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతంలో తాను చేసిన అభివృద్ధికి మరింత రెట్టింపు చేస్తానని, గత పాలకులు సగంలో ఆపేసిన పనులను పూర్తిచేయిస్తానని తెలిపారు. నరసన్నపేట నియోజవర్గంలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని, నరసన్నపేట పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు రమణమూర్తి సమాధానాలు చెప్పారు.

ఆగిన పనులు పూర్తి చేయిస్తా

(నరసన్నపేట)

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ రాక్షస పాలనకు అంతం తప్పదని నరసన్నపేట నియోజవకర్గ టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతంలో తాను చేసిన అభివృద్ధికి మరింత రెట్టింపు చేస్తానని, గత పాలకులు సగంలో ఆపేసిన పనులను పూర్తిచేయిస్తానని తెలిపారు. నరసన్నపేట నియోజవర్గంలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని, నరసన్నపేట పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు రమణమూర్తి సమాధానాలు చెప్పారు.

ప్రశ్న: మూడోసారి బరిలో నిలబడ్డారు. నియోజకవర్గ ప్రజలకు ఏమిచేయాలనుకున్నారు?

జవాబు: గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో చాలాపూర్తి చేశాం. సారవకోట మండలం బొంతు ఎత్తిపోథల పథకం, శ్రీముఖలింగం రక్షిత మంచినీటి పథకం, వనిత మండలం వంతెన తదితర పనులు 60 శాతం మేరకు పూర్తిచేశాం. ఆ తరువాత అధికారంలో వచ్చిన వైసీపీ ఈ పనులను పూర్తి చేయకుండా వదిలేసింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ పనులను పూర్తి చేయిస్తా. సారవకోట, జలుమూరు మండలాలకు తాగు, సాగునీరు సమస్య లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం. సుసరాం తుంపర భూములు, మడపాం ఎత్తిపోథల పథకం, పట్టణాభివృద్ధికి శ్రీకారం చుడతా.

ప్ర: ప్రజలకు అందుబాటులో ఉంటారా?

జ: నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా రావచ్చును. లేదా ఫోన్‌ చేసినా స్పందిస్తాను. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.

ప్ర: నరసన్నపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తారా?

జ: కచ్చితంగా. నరసన్నపేట పట్టణంలో ఉన్న రాజులు చెరువు అభివృద్ధికి గతంలో రూ.50లక్షలు మంజూరు చేశా. ప్రభుత్వం మారగానే ఆ చెరువును గాలికి వదిలేశారు. ఈసారి అఽధికారంలోకి వచ్చిన వెంటనే రాజులు చెరువును అభివృద్ధి చేస్తా. చెరువును పార్కుగా తీర్చిదిద్ది ట్రాక్‌ ఏర్పాటు చేస్తాం. అలాగే ఇండోర్‌ స్టేడియం నిర్మించడంతో పాటు జమ్ము జంక్షన్‌ నుంచి సత్యవరం జంక్షన్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ పూర్తి చేస్తా. పల్లిపేట రోడ్డును ఈదులవలస జంక్షన్‌ వరకు అభివృద్ధి చేస్తాను. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా. ఎర్రన్నాయుడు పార్కును వైసీపీ నాయకులు కూలగొట్టారు. దాన్ని మళ్లీ పునర్నిర్మించి ప్రజలకు అంకితం చేస్తాం.

ప్ర: రైతుల సమస్యలను ఎలా పరిష్కారిస్తారు?

జ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార కాలువలను ఆధునికీకరించి కొంత వరకు రైతులకు సాగునీరు అందించాం. వైసీపీ ప్రభుత్వం వంశధార కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క, పూడికతో నిండిపోయాయి. దీనివల్ల పోలాకి, నరసన్నపేట మండలాల్లోని శివారు రైతులకు నీరు అందడం లేదు. ఈసారి అధికారంలో వచ్చిన వెంటనే ఓపెన్‌హెడ్‌ చానళ్ల ద్వారా పాత కాలువలకు సాగునీరు వచ్చేటట్లు చేస్తా. వంశధార కాలువల ఆధునికీకరణను పూర్తిచేస్తాం.

ప్ర: మత్స్యకారులు, గిరిజనుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

జ: పోలాకి మండలంలో మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. మత్స్యకార గ్రామాల్లో రోడు ్లఏర్పాటు చేస్తాం. చేపలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మిస్తాం. వారి జీవన ప్రమాణాలు స్థాయి పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం సారవకోట మండలంలోని గిరిజను లకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. వారి పంటలను కొనుగోలు చేసేందుకు సారవకోటలో ఒక మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేస్తాం.

ప్ర: యువతకు ఉపాధి కల్పిస్తారా?

జ: కచ్చితంగా. నియోజవర్గం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కనుక ఈ ప్రాంతంలో ఫుడ్‌ప్రోసిసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.

ప్ర: వంశధార వరదల నుంచి నదితీర గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఏం చేస్తారు?

జ: జలుమూరు మండలం కరకవలస నుంచి పోలాకి మండలం పల్లిపేట వరకు కరకట్టలు లేకపోవడంతో వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రూ.52లక్షలతో పనులు చేశాం. గ్రోయిన్లు ఏర్పాటు చేశాం. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షణగోడలను ఏర్పాటు చేస్తాం.

Updated Date - May 08 , 2024 | 12:09 AM