Share News

కార్గిల్‌ వీరుల త్యాగాలు మరువలేనివి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:31 PM

భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్‌ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్‌ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు.

కార్గిల్‌ వీరుల త్యాగాలు మరువలేనివి
నరసన్నపేట: పోలీసు స్టేషన్‌ వద్ద విజయ్‌ దివస్‌లో పోలీసులు, యువత

- జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారిణి శైలజ

అరసవల్లి: భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్‌ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్‌ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు. శుక్రవారం ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో మాజీ సైనికుల జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబి రాన్ని ఆమె ప్రారంభించారు. కార్గిల్‌ అమరవీరుల త్యా గాలు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన సైనికుల వీర గాథలను నేటి యువతకు తెలియజెప్పాలని కోరారు. ఆనాటి యుద్ధంలో 527 మంది జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చే శారని, వారి దేశభక్తిని, స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకా కుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ సతీమణి స్వాతి, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల, యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు పి.రామారావు, ఎం.శంకరనారాయణ, కలివరపు.సాయిరాం, ఎస్‌.నారాయణ మూర్తి, ఎన్‌సీసీ అధికారి వై.పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మ డి శ్రీకాకుళం జిల్లా నుంచి వందలాది మాజీ సైనికులు తరలివచ్చి రక్త దానం చేసి వీర సైనికులకు నివాళులర్పించారు.

ఇచ్ఛాపురం పట్టణంలో..

ఇచ్ఛాపురం: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ పట్టణంలో యూ కాంప్లెక్స్‌ సమీ పంలో గల మాజీ సైనికోద్యోగుల కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వ హించారు. దేశ నాయకులు, వీర జవానుల చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వల చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు రామకృష్ణా రెడ్డి, బీఎల్‌ నారాయన, డి.విశ్వనాఽథంరెడ్డి, యు.శంకర్‌, మహదేవ్‌, ఢిల్లీష్‌, దుర్గయ్య, జగన్నాఽథ్‌, చంద్రశేఖర్‌, తులసీదాస్‌ పాల్గొన్నారు.

నివగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో..

కొత్తూరు: నివగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహించారు. అమర వీరులకు నివాళులర్పించారు. జాతీయ ఉత్త మ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారిశెల్లి రామరాజు మాట్లాడుతూ.. పాకి స్తాన్‌తో లక్షలాది మంది వీరోచితంగా పోరాడి చొరబాటుదారులు దేశంలోకి రాకుండా ఎదుర్కొన్నారని, ఈ పోరాటంలో అనేక మంది సైనికులు అశువు లబాసారన్నారు. విద్యార్థులతో ర్యాలీ చేశారు. అనంతరం మాజీ సైనికుడు నిలురోతు ఆనందరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అతిఽథి కామర్స్‌ అధ్యాపకులు పి.ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పోలీసు స్టేషన్‌ ఆవరణలో..

నరసన్నపేట: పట్టణంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకులు చైతన్యభారతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించారు. పాకిస్తాన్‌ దురాక్రమణపై ఎదురునిల్చి పోరాటం చేసిన భారతసైన్యం విజయసాధించిన రోజు అని, ఈ పోరాటంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారని చైతన్యభారతి కన్వీనర్‌ చింతు పాపారావు అన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ తులసీరావు, అసిరినాయుడు, బోర ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే రిటైర్టు ఆర్మీ ఉద్యోగులు సంక్షేమ భవనం వద్ద కార్గిల్‌ దివస్‌ వేడుకలను నిర్వహించారు

యువత రక్తదానం

కాశీబుగ్గ: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం, పవనపుత్ర సంస్థ సహకారంతో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వ హించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు బి.బారికి, ఫల్గుణరావు, సభ్యు లు వైకుంఠరావు, బాబూరావు, సూర్యనారాయణ, తాతారావు, ఐఎం రావు, జిల్లా అధ్యక్షుడు గోరు వాసుదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:31 PM