Share News

ఎవరికి ఓటేస్తారో?

ABN , Publish Date - May 09 , 2024 | 12:25 AM

అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఆఖరు ఘట్టానికి చేరు కుంది. ఈనేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న అభ్యర్థులకు ప్రజలు అట్టాహాసంగా స్వాగతం పలికి మంగళహారతులు అందించి నీరాజనాలు పలుకుతున్నారు. ప్రధానపార్టీల అభ్యర్ధ్థులను గ్రామస్థాయి నాయకుల ప్రోత్సాహంతో మహిళలు నుదుటను తిలకం దిద్ది జేజేలు పలుకుతున్నారు. ఆయాపార్టీల మేనిఫెస్టోలను వివరించి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు, అభ్యర్థులు కోరుతున్నారు. ఏపార్టీ అభ్యర్థి వచ్చిన జేజేలు పలుకుతున్న ఓటర్లు పోలింగ్‌ రోజున ఓటుఎవరికి వేస్తారోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఒక పార్టీకి మద్దతు తెలిపితే కుమారుడు మరో పార్టీకి మద్దతు పలికి జేజేలు కొడుతున్నారు. చివరకు ఓటరు ఏపార్టీకి నీరాజనాలు అందిస్తారనేది వేచి చూడాల్సిందే.

 ఎవరికి ఓటేస్తారో?

(జలుమూరు)

Updated Date - May 09 , 2024 | 12:25 AM