Share News

Tadepalli : భరతమాత విగ్రహ పునఃప్రతిష్ఠ

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:12 AM

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటికి వెళ్లే రోడ్‌ మొదట్లో గతంలో తొలగించిన చోటే భరతమాత విగ్రహాన్ని గురువారం మళ్లీ పునఃపత్రిష్ఠ చేసి ఆవిష్కరించారు.

 Tadepalli : భరతమాత విగ్రహ పునఃప్రతిష్ఠ

  • గతంలో జగన్‌ ఇంటిముందు తొలగించిన చోటే..

తాడేపల్లి టౌన్‌, ఆగస్టు 15: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటికి వెళ్లే రోడ్‌ మొదట్లో గతంలో తొలగించిన చోటే భరతమాత విగ్రహాన్ని గురువారం మళ్లీ పునఃపత్రిష్ఠ చేసి ఆవిష్కరించారు. నాడు జగన్‌ ఇంటి ముందు విశాలమైన రోడ్డు నిర్మాణం కోసం పేదల ఇళ్లు తొలగింపుతోపాటు ఎన్నో ఏళ్లుగా ఉన్న భరతమాత విగ్రహాన్ని అప్పట్లో అధికారులు తొలగించారు.

భరతమాత సర్కిల్‌గా పేరుగాంచిన ఆ ప్రాంతంలో విగ్రహ తొలగింపును అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతోపాటు బీజేపీతో సహా పలు పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. అవేమీ పట్టించుకోకుకుం డా అర్ధరాత్రి సమయంలో క్రేన్‌ సా యంతో విగ్రహాన్ని తొలగించేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రాగనే, మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందు ఉన్న రోడ్‌కు ఆంక్షలు తొలగించి, అందరూ ప్రయాణించే విధంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్‌ చేశారు.

అదే విధంగా రోడ్‌ కోసం తొలగించిన భరతమాత విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఆవిష్కరించడంతోపాటు పురప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించి, అందరితో జాతీయ గీతాలపన చేయించారు.

Updated Date - Aug 16 , 2024 | 05:12 AM