Tirumala Laddi Issue: తిరుపతి లడ్డూ వివాదం.. యూపీ ఆలయాల్లో కీలక మార్పులు..
ABN , Publish Date - Sep 26 , 2024 | 05:45 PM
ప్రయాగ్‌రాజ్‌లోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల విషయంలో పలు ఆంక్షలను ప్రకటించాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ లలితా దేవి ఆలయంలో..
తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు వ్యర్థాలు, కొవ్వు పదార్థాలు కలిశాయని ఎన్‌డీబీబీ నివేదిక స్పష్టం చేయడంతో దేశంలోని వివిధ ఆలయాలు అప్రమత్తం అయ్యాయి. ప్రసాదం కోసం భక్తులు బయట నుంచి స్వీట్లు, ఇతర వండిన పదార్థాలను తీసుకురావొద్దని ప్రయాగ్‌రాజ్‌లోని కొన్ని ఆలయాలు ఆంక్షలు విధించాయి. కొబ్బరి కాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రసాదంగా తీసుకురావాలని ఆలయ ప్రతినిధులు కోరారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల విషయంలో పలు ఆంక్షలను ప్రకటించాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ లలితా దేవి ఆలయంలో ఓ సమావేశం ఏర్పాటుచేసి అమ్మవారికి స్వీట్లను ప్రసాదం ఇవ్వకూడదని ఆలయ నిర్వహకులు నిర్ణయించారు. స్వీట్లకు బదులు కొబ్బరి, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి అమ్మవారికి సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ పూజరులు అధికారికంగా తెలియజేశారు. కల్తీ పదార్థాలతో తయారైన స్వీట్లను అమ్మవారికి సమర్పించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు స్వచ్ఛమైన స్వీట్లు అందుబాటులో ఉండేలా దుకాణాలు తెరిచే ఆలోచనలో ఉన్నట్లు ఆలయ ప్రతినిధులు వెల్లడించారు.
Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..
మరికొన్ని ఆలయాల్లో..
భక్తులు బయటి నుంచి స్వీట్లు, ప్రసాదాలు తీసుకురాకుండా నిషేధం విధించినట్లు ఆలోప్ శాంకరీ దేవి ఆలయ పూజారులు ప్రకటించారు. యమునా నది ఒడ్డున ఉన్న మంకమేశ్వర్ ఆలయానికి బయటి నుండి ప్రసాదం తీసుకురావడాన్ని నిషేధించారు. ఆలయం వెలుపల దుకాణాల్లో లభించే ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని జిల్లా కలెక్టర్‌కు ఆలయ ప్రతినిధులు లేఖలు రాశారు. నాణ్యత పరీక్షలు పూర్తయ్యేవరకు దుకాణాల్లో లభించే స్వట్లను ఆలయంలో ప్రసాదం సమర్పించడానికి అనుమతించబోమని, స్వీట్ల స్థానంలో పండ్లను సమర్పించాలని భక్తులను కోరుతున్నట్లు తెలిపారు.
Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో..
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రసాదాల విషయంలో భక్తుల్లో ఆందోళన నెలకొంది. స్వీట్లను ప్రసాదంగా ఉపయోగిస్తున్న ఆలయాల్లో వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే వస్తువుల స్వచ్ఛతను పరీక్షిస్తున్నారు. ప్రసాదాల తయారీ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here