Share News

YS Jagan: తాడేపల్లి వాసులకు లభించిన స్వేచ్చ..!!

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:57 AM

తాడేపల్లి ప్యాలెస్‌ నిర్మాణంలో ఉన్నప్పటి చిత్రమిది! బకింగ్‌ హామ్‌ కెనాల్‌, దాని కట్టపైన రోడ్డు,

 YS Jagan: తాడేపల్లి వాసులకు లభించిన స్వేచ్చ..!!
Tadepally

‘నేను బాగుండాలి. నా ప్యాలెస్‌ భద్రంగా ఉండాలి. జనం ఏమైపోయినా, ఎన్ని కష్టాలు పడినా ఫర్వాలేదు!’... ఇదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలసీ! తాడేపల్లిలో ఆయన కట్టుకున్న ప్యాలెస్‌ విలాసాలే దీనికి నిదర్శనం. ఈ ఐదేళ్లూ ప్యాలెస్‌ చుట్టుపక్కల అడుగు పెట్టేందుకు వీల్లేకుండా వందలమంది పోలీసులను మోహరించారు. గేట్లు పెట్టారు. దారులు మూశారు. ఇప్పుడు... ‘తాడేపల్లి’కి స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వ ధనంతో ‘ముఖ్యమంత్రికి మాత్రమే’ వేసుకున్న రహదారులు సామాన్యులకూ తెరుచుకున్నాయి. సొంత ఇంటికి వెళ్లేందుకూ స్థానికులు గుర్తింపు కార్డులు చూపించాల్సిన దుస్థితి తొలగిపోయింది. పక్కనే ఉన్న పొలానికి రైతులు చుట్టూ తిరిగితిరిగి వెళ్లాల్సిన కష్టం దూరమైంది. ముఖ్యమంత్రిగా జగన్‌ చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు కెమెరా కళ్లకు చిక్కుతున్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర కథనం...


పేదలున్నారు...

తాడేపల్లి ప్యాలెస్‌ నిర్మాణంలో ఉన్నప్పటి చిత్రమిది! బకింగ్‌ హామ్‌ కెనాల్‌, దాని కట్టపైన రోడ్డు, ఆ పక్కనే సామాన్యులు ఎప్పటి నుంచో నివసిస్తున్న ఇళ్లు, రోడ్డు... ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ ప్రాంతం ఇలా ఉండేది.


తరిమేశారు..

తాడేపల్లి ప్యాలెస్‌ నిర్మాణం పూర్తయి... జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసిన చిత్రమిది! బకింగ్‌ హామ్‌ కెనాల్‌ కరకట్టపై రోడ్డు మాయమైంది. ఆ పక్కనే ఉన్న పేదల ఇళ్లను కూల్చేసి... వారందరినీ అక్కడి నుంచి తరిమేశారు. ఆ స్థానంలో మొక్కలు, పూదోటలు పెంచారు. చిన్నగా ఉన్న రహదారి కాస్తా... విశాలంగా మారింది.


జనం రహదారికి అడ్డు గేట్లు

తాడేపల్లి ప్యాలెస్‌ కోసం దారుణాలు

ఇంత భయమెందుకు జగన్‌?

జైలు కాదు ఇల్లు...

సుమారు 30 అడుగుల ఎత్తున ఇనుప కవచం మధ్య ఉన్న ఈ నిర్మాణం సెంట్రల్‌ జైలు కాదండోయ్‌! ఇదే తాడేపల్లి ప్యాలెస్‌ సముదాయం! గతంలో ఇది పార్టీ కార్యాలయం. సీఎం అయ్యాక దానినే క్యాంప్‌ కార్యాలయంగా మార్చుకున్నారు. సచివాలయం ముఖం చూడకుండా ఇక్కడి నుంచే పాలన సాగించారు. ఆ పక్కన ఉన్నది జగన్‌ నివాసం. గోశాల, మరికొన్ని నిర్మాణాలూ ఫొటోలో చూడొచ్చు.


ఎందుకింత అ....భద్రత

ఇది తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లే దారి! నిజానికి... ఇది ప్రజలందరికీ రహదారి. జగన్‌ సీఎం కాగానే ఆయన సొంత దారి అయిపోయింది. దాదాపుగా పార్లమెంటు భవన సముదాయంతో సమానమైన భద్రత ఏర్పాటు చేశారు. బటన్‌ నొక్కితే మూసుకుపోయే గేట్లు... ఆటోమేటిక్‌గా నేలలోనుంచి పైకి లేచి వచ్చే ఉక్కు స్తంభాలు, సీసీటీవీ కెమెరాలు, నిరంతర గస్తీ కోసం వందలాదిగా పోలీసులు! ఇదీ... జగన్‌ తనకోసం ఏర్పాటు చేసుకున్న భద్రత!

Updated Date - Jun 20 , 2024 | 10:11 AM