Share News

Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ABN , Publish Date - Jul 24 , 2024 | 09:28 AM

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలో 100 కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలో 100 కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చింతూరు నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు ఐదు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల్లోనే డ్రైవర్లు వంటలు చేసుకుంటున్నారు.


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు,అయినవిల్లి మండలాల్లో లంక గ్రామాలు జలదిగ్బందంలో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 55 వేల ఎకరాలకు పైగా వరి, 30 వేల ఎకరాలకు పైగా నారుమళ్ళు, 1400 ఎకరాలకు పైగా ఉద్యాన, కూరగాయలు పంటలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 46.07 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 10,83,684 క్యూసెక్కులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది.


గోదావరి వరదపై అధికారులతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నానికి వరద ప్రవాహం తగ్గవచ్చని పేర్కొన్నారు. గోదావరి పరివాహ ప్రాంతంలో గడిచిన 12 నుంచి 18 గంటల్లో వర్షపాతం నమోదు అవ్వలేదని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీరు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీరు ఎగువ నుంచి నిలకడగా చేరుతోంది. ప్రస్తుతానికి 14.50లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ హ్యాపీ..

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 09:28 AM