Share News

TDP: లోక్‌సభలో టీడీపీ నేతల స్టార్ ప్రశ్నలివే..

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:37 PM

నేడుపార్లమెంటు ఉభయ సభల సమావేశం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగేందుకు తెలుగు ఎంపీలు స్టార్ ప్రశ్నలు ముందుగానే సిద్ధం చేసుకున్నారు.

TDP: లోక్‌సభలో టీడీపీ నేతల స్టార్ ప్రశ్నలివే..

ఢిల్లీ: నేడుపార్లమెంటు ఉభయ సభల సమావేశం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగేందుకు తెలుగు ఎంపీలు స్టార్ ప్రశ్నలు ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కేంద్ర పథకాల ద్వారా ఏపీకి అందిన నిధుల వివరాలు తెలపాలని టీడీపీ ఎంపీలు దగ్గమళ్ల ప్రసాద రావు, కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇచ్చిందా అని మరో ప్రశ్న అడిగారు. అలాగే ఆ నిధుల ఖర్చుపై రాష్ట్రప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇచ్చిందా? అని.. అంటూ మరో ప్రశ్న సంధించారు.


యువతకు శిక్షణ కోర్సులపై టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్ ప్రశ్నలు అడిగారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కొందరు ఎంపీలు కోరారు. జిల్లాల వారీగా ఆ నిధుల వినియోగం వివరాలు తెలపాలని ఎంపీలు కోరారు. కాగా.. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా నిర్మలానే మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1న లోక్‌సభ ఎన్నికలకు ముందు సమర్పించడం జరిగింది.


ఆర్థిక సర్వే నివేదికను ఇవాళ సమర్పించనున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆ నివేదికలో పేర్కొననున్నారు. ఈ సర్వేలో వివిధ ఆర్థిక రంగాల పనితీరు, ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు వంటి వివరాలు ఉంటాయి. ఇక ఈ సమావేశంలో వివాదాస్పద అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్‌గా జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి...

Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!

Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి...

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 12:38 PM