Share News

టీటీడీలో రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:44 AM

రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీలో రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

  • ప్రభుత్వాదేశాలతో ఈవో నిర్ణయం

  • వైసీపీ హయాంలో రివర్స్‌ మంత్రం

  • ఎలాంటి ప్రయోజనం లేని వైనం

  • దీంతో రివర్స్‌కు కూటమి సర్కారు బ్రేక్‌

  • కల్తీలు, నాసిరకం సరుకులకు చెక్‌

తిరుపతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తొలుత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుసరించిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ఇతర అన్ని శాఖలు, విభాగాలకు వర్తింపజేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో టీటీడీలో సైతం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అనుసరించారు. అయితే.. ఈ విధానమే పలు విషయాలను వివాదాస్పదం చేసింది. ముఖ్యంగా కల్తీ నెయ్యి వెనుక రివర్స్‌ టెండరింగ్‌ విధానం ఉందని, నాసిరకం, కల్తీ వంటివి చోటు చేసుకోవడానికి ఇదే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీటీడీలో కూడా ఈ నెల 1వ తేదీ నుంచి రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతికి స్వస్తి పలికారు.

  • 2020 నుంచి రివర్సే!

గత వైసీపీ ప్రభుత్వం నిధుల ఆదా పేరిట రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తెచ్చింది. దీనిలో భాగంగా 2020, ఆగస్టు 31 నుంచి టీటీడీలో కూడా ఈ పద్ధతిని అమలు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల నిర్మాణ పనికి లేదా వస్తువుల కొనుగోలుకు కేటాయించే నిధుల మొత్తం తగ్గాలి. అయితే ఆ పని నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా జరగలేదు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా నిధులు ఆదా చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్న అప్పటి ప్రభుత్వం నిజానికి ఇతర అడ్డదారుల్లో అసలుకే మోసం వచ్చేలా వ్యవహరించింది. సాధారణ టెండరింగ్‌ విధానంలో ఒక పనికి నిర్దేశించిన అంచనా వ్యయం కంటే రివర్స్‌ టెండరింగ్‌లో స్వల్ప తగ్గుదల ఉండాలి.

కానీ, టీటీడీలో దానికి విరుద్ధంగా పనులు జరిగాయి. అంచనా వ్యయం తక్కువ చూపి నిధులు ఆదా చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్న గత పాలకమండళ్లు, అధికారులు.. అసలు అవసరం లేని పనులు చేపట్టారు. స్విమ్స్‌లో నిక్షేపంగా ఉన్న భవనాలను పునరుద్ధరించడం, మరమ్మతులు చేపట్టడం దీనిలో భాగమే. పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన గోవిందరాజస్వామి సత్రాల విషయంలోనూ అలాగే వ్యవహరించారు. రూ.కోట్లు వెచ్చించి పునరుద్ధరించిన సత్రాలను కూల్చివేసి నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. శ్రీవాణి ట్రస్టు కింద చేపట్టిన నిర్మాణాలు, పునరుద్ధరణలు, మరమ్మతులు చాలా వరకు ఆరోపణలకు దారి తీశాయి. ఇక సామగ్రి, వస్తువులు, ముడిసరుకుల కొనుగోళ్లకు కూడా ఇదే విధానం అవలంభించడంతో నాణ్యత ప్రశ్నార్థకమైంది.

Updated Date - Oct 06 , 2024 | 04:44 AM