Share News

Minister Narayana: డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టండి..

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:40 AM

పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించనున్నారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు

Minister Narayana: డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టండి..

అమరావతి: పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) సమీక్ష నిర్వహించనున్నారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్ లైన్‌ల లీకేజీలను అరికట్టినట్లు కమిషనర్ చెప్పారు. పట్టణంలోని బోర్ లను మూసివేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. డయేరియా కేసులు పెరగకుండా శానిటేషన్, బ్లీచింగ్, మురుగు కాలువల్లో స్ప్రే చేయడం, ఫాగింగ్ చేస్తున్నట్లు మంత్రికి కమిషనర్ వివరించారు.


పట్టణంలో డయేరియాను అదుపులోకి తీసుకొచ్చేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు నారాయణకు పల్నాడు జిల్లా వైద్యారోగ్య అధికారి రవి తెలిపారు. సున్నా కేసులు తీసుకొచ్చే వరకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్, వైద్యారోగ్య అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండి డయేరియా రాకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. కేసులు తగ్గిన తర్వాత కూడా మరికొన్ని రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిడుగురాళ్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని అధికారులను నారాయణ ఆదేశించారు.

Updated Date - Jul 11 , 2024 | 12:11 PM