Share News

Veerballi students for state sports : రాష్ట్ర క్రీడలకు వీరబల్లి విద్యార్థులు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:35 PM

ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో వీరబల్లి జడ్పీ హైస్కూల్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థు లు, నందలూరు మండలం టంగుటూరు హైస్కూ ల్‌ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెడ్డెయ్య వేణుమాధవరాజు, శ్రీనివాసులు తెలిపా రు.

Veerballi students for state sports : రాష్ట్ర క్రీడలకు వీరబల్లి విద్యార్థులు
వీరబల్లి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు

కబడ్డీలో ప్రతిభ చాటిన రెడ్డికావ్య

వీరబల్లి నుంచి ఎనిమిది మంది, టంగుటూరు నుంచి ఏడుగురు ఎంపిక

వీరబల్లి, అక్టోబరు1: ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో వీరబల్లి జడ్పీ హైస్కూల్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థు లు, నందలూరు మండలం టంగుటూరు హైస్కూ ల్‌ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెడ్డెయ్య వేణుమాధవరాజు, శ్రీనివాసులు తెలిపా రు. అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేటలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి ఒకే పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయికి 8 మంది ఎంపికైనట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం తెలిపారు. సాఫ్ట్‌ బాల్‌ అండర్‌-17 బాలుర విభాగంలో భరత్‌, నాస ర్‌, బాలికల విభాగంలో కావ్య, అండర్‌-17 బేస్‌బాల్‌ బాలుర విభాగంలో నాసర్‌, అండర్‌-14లో స్వాతిక్‌ ఎంపికయ్యారు. వీరిని మంగళవారం జడ్పీ పాఠశా లలో జరిగిన సమావేశంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, ఇన్‌చార్జి హెచ్‌ఎం రెడ్డెయ్య, వీఆర్‌డీఎస్‌ చైర్మెన్‌ సురేంద్రారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డీవీఎస్‌ కుమార్‌, రామచంద్ర, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని

డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 కబడ్డీ బాలికల విభాగంలో రెడ్డికావ్య ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం చంద్రశేఖర్‌, పీడీ శేఖర్‌ తెలిపారు. ఈమెను వారు సత్కరించారు. జాతీయ స్థాయిలో గెలుపొందాలని ఆకాక్షించారు.


3tsp1.gifసుండుపల్లె నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు

రాష్ట్ర పోటీలకు సుండుపల్లె విద్యార్థులు

సుండుపల్లె, సెప్టెంబరు1: సుండుపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు మాసాపేట లో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్రరాజు తెలిపా రు. అండర్‌-17 సాఫ్ట్‌బాల్‌కు ఆంజనేయులు, వెంక టేశ్వర్లు, బేబి, అండర్‌-17 బేస్‌బాల్‌కు ఉదయ్‌కిరణ్‌, భరత్‌కుమార్‌, బేబి, అండర్‌-14 బేస్‌బాల్‌కు కిరణ్‌ కుమార్‌, వంశీ, సంధ్య, అండర్‌-14 సాఫ్ట్‌బాల్‌కు అభి, కిరణ్‌కుమార్‌, జేష ఎంపికయ్యారు. సుండుప ల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి జిల్లా జట్టు కు ఎంపికై రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్లడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు జయన్న హర్షం వ్యక్తం చేశారు. అలాగే వ్యాయామ ఉపాధ్యా యులను విద్యార్థినీ, విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు.

టంగుటూరు విద్యార్థులు...

నందలూరు, అక్టోబరు 1: ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరి గిన మల్కంమోడ్రన్‌, పెంటతిరియన్‌, రగ్బీ, షూ టింగ్‌బాల్‌, రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో టంగుటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా భీమవరం, కర్నూలు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆయా క్రీడల తేదీల ప్రకారం జరిగే పోటీలకు వెళ్లాల్సి ఉం టుందన్నారు. ఫిజికల్‌ డైరెక్టర్‌ గణేష్‌ బాబు, చాన్‌ బాషా, మస్తానయ్య, రమేష్‌బాబు, లక్ష్మీనారాయణ రెడ్డి, మోహన్‌రాజు, లక్ష్మీదేవి, శశికళ, రజని, నాగా ర్జున, బాదుల్లా, ఎంపికైన విద్యార్థులను సత్కరించారు.

Updated Date - Oct 01 , 2024 | 11:35 PM