Share News

వీడని ముసురు

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:01 AM

జిల్లాను ముసురు వీడడం లేదు. శుక్రవారం సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా పరిస్థితి చూస్తే వర్షం తగ్గే సూచనలు ఏ మాత్రం కన్పించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు, వాగులు ఉధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లో గెడ్డలు, వాగుల పరిస్థితి అలానే ఉంది, జిల్లాలోని వరద ప్రభావం అధికంగా ఉన్న చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జే.అభిషేక్‌ వరద సహాయక, పునరావస చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

వీడని ముసురు
పాడేరులో నెలకొన్న ముసురు వాతావరణం

తగ్గని ఈదురుగాలుల వర్షం

కొనసాగుతున్న వరద బీభత్స వాతావరణం

పాడేరు/అరకులోయ, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాను ముసురు వీడడం లేదు. శుక్రవారం సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా పరిస్థితి చూస్తే వర్షం తగ్గే సూచనలు ఏ మాత్రం కన్పించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు, వాగులు ఉధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లో గెడ్డలు, వాగుల పరిస్థితి అలానే ఉంది, జిల్లాలోని వరద ప్రభావం అధికంగా ఉన్న చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జే.అభిషేక్‌ వరద సహాయక, పునరావస చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అరకులోయ, పరిసర ప్రాంతాలలో ముసురు వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా ఇదే వాతావరణం కొనసాగుతునే ఉంది. శుక్రవారం తెల్లవారుజూము నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతునే ఉంది. దీంతో జన జీవనం దాదాపు స్తంభించిపోయింది. శుక్రవారం అరకు వారపు సంత అయినప్పటికీ వ్యాపారులు అరకొరగానే వచ్చారు. గెడ్డలు పొంగుతుండడంతో గిరిజనులు ఊర్లు దాటి రావడం లేదు. దీంతో సంతలో వ్యాపారాలు జరగడం లేదు. గత ఐదు రోజులుగా సుంకరమెట్ట ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రతి రోజూ విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోతున్నదని గిరిజనులు వాపోతున్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:01 AM