Share News

Home Minister Anitha: గంజాయి మత్తులో అనేక దారుణాలు..

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:13 PM

అమరావతి: రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ముందు గంజాయిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కోరారు.

Home Minister Anitha: గంజాయి మత్తులో అనేక దారుణాలు..

అమరావతి: రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ (Blade Batch), గంజాయి (Marijuana), రౌడీయిజం (Rowdyism)పై ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ (MLA Battula Balaram Krishna) ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సమాధానం ఇచ్చారు. ముందు గంజాయిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి (MLA Madhavi Reddy) కోరారు. దీనిపై హోంమంత్రి మాట్లాడుతూ.. గంజాయి మత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయని, రౌడీయిజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వారికి గంజాయి దొరకకపోతే వైష్ణర్‌ వాసనను గట్టిగా పీల్చి.. తద్వారా మత్తులోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.


గత ప్రభుత్వ హయాంలో సీసీటీవీ కెమెరాలు కూడా పని చేయలేదని, క్రిమినల్స్‌ను పట్టుకుంటే వారి పూర్వ చరిత్ర చూసుకునే సిస్టమ్ కూడా లేకుండా చేశారన్నారు. చివరకు గుడి, బడికి కూడా భద్రత లేదని, చివరకు గత ప్రభుత్వ హయాంలో నియంత్రణ లేక స్కూల్స్‌లో కూడా గంజాయి వచ్చిందన్నారు. గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయిందని, నియంత్రణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.


సీసీ కెమెరాలు పునరుద్ధరించుకుని, టెక్నాలజీని ఉపయోగించుకుని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసే ఆలోచన కూడా రాకుండా ఉక్కుపాదం మోపడానికి పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకరిస్తున్నారని హోంమంత్రి సభకు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 25 , 2024 | 12:13 PM